జాతీయ క్రీడా పురస్కారాల్లో బ్యాడ్మింటన్ విభాగం, ఈ ఏడాది అరుదైన మైలురాయిని అందుకుంది. ఆరు ప్రతిష్ఠాత్మక అవార్డులను గెలుచుకుంది. తొలిసారి ధ్యాన్‌చంద్ జీవితకాల సాఫల్య పురస్కారాన్ని సొంతం చేసుకుంది. ఈ విషయమై భారత బ్యాడ్మింటన్ సమాఖ్య సెక్రటరీ అజయ్ సింఘానియా హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి గుర్తింపే ఆటగాళ్లకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని అన్నారు.
జాతీయ క్రీడా పురస్కారాల్లో 'బ్యాడ్మింటన్' జోరు - బ్యాడ్మింట్న్కు అవార్డులు
2020 జాతీయ క్రీడా పురస్కారాల్లో బ్యాడ్మింటన్ విభాగానికి తొలిసారి ఆరు అవార్డులు దక్కాయి. దీనిపై స్పందించిన బాయ్ సెక్రటరీ అజయ్ సింఘానియా ఇలాంటి గుర్తింపే ఆటగాళ్లకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని చెప్పారు.
బ్యాడ్మింటన్
మాజీ స్టార్ ఆటగాళ్లు ప్రదీప్ గాంధీ, త్రుప్తి ముర్గుందె, సత్యప్రకాశ్ తివారీలకు ధ్యాన్‌చంద్ అవార్డు లభించింది. పారా బ్యాడ్మింటన్ హెడ్ కోచ్ గౌరవ్ ఖన్నాకు ద్రోణాచార్య అవార్డు.. మెన్స్ డబుల్స్ విభాగంలో భారత నెం.1 జోడీ చిరాగ్ శెట్టి, సాత్విక్ రంకిరెడ్డికి అర్జున అవార్డు దక్కింది. వీరంతా జాతీయ క్రీడా దినోత్సవం రోజు(ఆగస్టు 29) ఈ అవార్డులను వర్చువల్ విధానంలో అందుకోనున్నారు.
ఇది చూడండి రోహిత్‌లా ఆడాలనుకుంటున్న గావస్కర్