తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఘనంగా షట్లర్​ సాయిప్రణీత్‌ వివాహం... - Sai Praneeth news

ప్రముఖ షట్లర్‌ సాయిప్రణీత్‌ ఓ ఇంటివాడయ్యాడు. లక్ష్మీశ్వేతను అతడు వివాహం చేసుకున్నాడు. ఆదివారం కాకినాడలో జరిగిన పెళ్లికి.. సాత్విక్‌ సాయిరాజు సహా పలువురు బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు హాజరయ్యారు.

badminton star B Sai Praneeth tied the knot with Swetha Jayanthi and attend so many people
ఘనంగా సాయిప్రణీత్‌ వివాహం.. ఆశీర్వదించిన కుటుంబసభ్యులు

By

Published : Dec 9, 2019, 8:01 AM IST

ప్రపంచ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్​ కాంస్య విజేత సాయి ప్రణీత్​ ఓ ఇంటివాడయ్యాడు. కాకినాడలోని తన స్వగృహం వద్ద ఆదివారం లక్ష్మీ శ్వేతను పెళ్లి చేసుకున్నాడు. ఘనంగా జరిగిన ఈ వివాహ వేడుకకు డబుల్స్​ క్రీడాకారుడు సాత్విక్​సాయిరాజ్​ రాంకీరెడ్డి సహా పలువురు ప్రముఖులు, క్రీడాకారులు హాజరయ్యారు. మరికొందరు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

ప్రణీత్​-శ్వేత జోడీతో సాత్విక్​

అర్జున నుంచి ఒలింపిక్స్​కు...

ఈ ఏడాది అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు ప్రణీత్​​. 1983 ప్రపంచ ఛాంపియన్​షిప్​లో ప్రకాశ్​ పదుకొనే పతకం గెలిచిన తర్వాత మరోసారి మెడల్(కాంస్యం)​ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

ఈ ఏడాది బీడబ్ల్యూఎఫ్​ ర్యాంకింగ్స్​లో టాప్​-10లోనూ చోటు దక్కించుకున్నాడు. అంతేకాకుండా క్రీడల్లో అత్యున్నత పురస్కారం అర్జున అవార్డునూ అందుకున్నాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్​ జాబితాలో 11వ స్థానంలో ఉన్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించాడీ బ్యాడ్మింటన్​ స్టార్​.

ABOUT THE AUTHOR

...view details