తెలంగాణ

telangana

ETV Bharat / sports

కొరియా ఓపెన్​ క్వార్టర్స్​లో పారుపల్లి కశ్యప్​ - Kashyap enters quarters of Korea Open

ఇంచియాన్ వేదికగా జరుగుతున్న కొరియా ఓపెన్​లో తెలుగుతేజం పారుపల్లి కశ్యప్ క్వార్టర్స్​కు దూసుకొచ్చాడు. ఇండోనేసియాకు చెందిన డారెన్​ లివ్​పై 21-17, 11-21, 21-12 తేడాతో గెలిచాడు.

కశ్యప్

By

Published : Sep 26, 2019, 11:25 AM IST

Updated : Oct 2, 2019, 1:46 AM IST

కొరియా ఓపెన్​లో భారత స్టార్ షట్లర్లందరూ ఇంటిముఖం పడుతున్న వేళ.. పారుపల్లి కశ్యప్ మాత్రం ఒక్కో మెట్టు ఎక్కుతూ క్వార్టర్స్​కు దూసుకొచ్చాడు. గురువారం పురుషుల సింగిల్స్​లో మలేసియాకు చెందిన డారెన్ లివ్​పై విజయం సాధించాడు.

21-17, 11-21, 21-17 తేడాతో నెగ్గి క్వార్టర్స్​లో అడుగుపెట్టాడు. 56 నిమిషాల పాటు సాగిన మ్యాచ్​లో తొలిసెట్ సునాయాసంగా గెలిచిన కశ్యప్.. రెండో సెట్​లో తడబడ్డాడు. ఫలితంగా ఆ గేమ్ చేజార్చుకున్నప్పటికీ మూడో సెట్​లో ప్రత్యర్థిని బోల్తా కొట్టించి మ్యాచ్ సొంతం చేసుకున్నాడు.

టోర్నీ ప్రారంభంలోనే సైనా, సింధు, సాయి ప్రణీత్ లాంటి స్టార్ షట్లర్లు వరుసగా ఇంటిముఖం పట్టారు. అయితే పారుపల్లి కశ్యప్ ఒక్కోమ్యాచ్ గెలుస్తూ సత్తాచాటుతున్నాడు. ఇంకో మ్యాచ్​ నెగ్గితే పతకం ఖరారు చేసుకుంటాడు.

ఆంథోని(ఇండోనేసియా)- జేన్(డెన్మార్క్​)ల్లో గెలిచిన వారితో తర్వాతి మ్యాచ్​లో తలపడనున్నాడు పారుపల్లి కశ్యప్.

ఇదీ చదవండి: పాపులారిటీలో నరేంద్రుడి తర్వాత మహేంద్రుడే టాప్!

Last Updated : Oct 2, 2019, 1:46 AM IST

ABOUT THE AUTHOR

...view details