భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు అరుదైన గౌరవం దక్కనుంది. కేరళలోని నీలంపెరూర్ పల్లి భగవతి ఆలయంలో జరుగుతోన్న పదయని ఉత్సవాల్లో ఆమె బొమ్మను ప్రదర్శించనున్నారు. 16 రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో చివరి రోజైన సెప్టెంబర్ 27న ఆమె ఆరడుగుల ప్రతిమను ఉంచుతారు.
బ్యాడ్మింటన్ రాకెట్‌ను చేతిలో పట్టుకుని ఉన్న సింధు బొమ్మను రూపొందిస్తున్నారు. వక్క, అరటి చెట్ల బెరడు, తామర ఆకులు, వెదురు వంటి సహజసిద్ధ పదార్థాలతో సింధు బొమ్మను తయారు చేస్తున్నారు. ఇప్పటికే తయారీ ప్రక్రియ పూర్తి కావొస్తుందని అక్కడి గ్రామస్థులు తెలిపారు.