వచ్చేవారం చైనాలోని వుహాన్‌లో ప్రారంభం కావాల్సిన ఆసియా మిక్స్‌డ్ టీమ్ ఛాంపియన్‌షిప్ రద్దయింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రయాణ ఆంక్షలు, కఠినమైన క్వారంటైన్ నిబంధనల నేపథ్యంలో టోర్నీని రద్దు చేస్తున్నట్లు బుధవారం బ్యాడ్మింటన్ ఆసియా (బీఏ) ప్రకటించింది.
ఆసియా మిక్స్‌డ్ బ్యాడ్మింటన్ రద్దు - Badminton
వచ్చే వారం చైనా వూహాన్లో ప్రారంభం కావాల్సిన ఆసియా మిక్స్‌డ్ టీమ్ ఛాంపియన్‌షిప్‌ను రద్దు చేస్తున్నట్లు బ్యాడ్మింటన్ ఆసియా(బీఏ) ప్రకటించింది. కరోనా కారణంగానే టోర్నీని నిలిపివేస్తున్నట్లు బీఏ తెలిపింది.
"కరోనా మహమ్మారి కారణంగా చాలా ఆసియా దేశాల ప్రభుత్వాలు ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగిస్తున్నాయి. కఠినమైన క్వారంటైన్ నిబంధనల్ని అమలు చేస్తున్నాయి. థాయ్‌లాండ్ ఓపెన్‌లు, ప్రపంచ టూర్ ఫైనల్స్‌లో పాల్గొన్న క్రీడాకారులు కూడా 2 వారాలు క్వారంటైన్‌లో ఉండాలి. ఫలితంగా ఆసియా మిక్స్‌డ్ టోర్నీలో సదరు క్రీడాకారులు పాల్గొనలేరు. 2021 సుదిర్మన్ కప్ ఫైనల్స్‌కు ఇది క్వాలిఫయింగ్ టోర్నీ. ఆసియా టోర్నీ జరగకపోతే ర్యాంకుల ఆధారంగా కోటా బెర్తులు లభిస్తాయి" అని బీఏ పేర్కొంది.
ఇదీ చదవండి:ద్రవిడ్‌పై సచిన్ అలిగిన వేళ!