ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ భాజపాలో చేరారు. దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో ఆమె కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ పార్టీ కండువా కప్పి సభ్యత్వ రసీదును అందజేశారు. సైనాతో పాటు ఆమె సోదరి చంద్రాన్హూ నెహ్వాల్ కూడా భాజపాలో చేరారు.
అనంతరం భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాను మర్యాదపూర్వకంగా కలిశారు సైనా. ప్రధాని నరేంద్ర మోదీలా దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే తాను భాజపాలో చేరినట్టు చెప్పారు.
"బ్యాడ్మింటన్ ఆట ప్రారంభించిప్పుడు ప్రత్యేక కారణం ఏమీ లేదు. ఇప్పుడు భాజపాలో చేరడానికి కూడా కారణమేమీ లేదు. మన ప్రధాని రాత్రింబవళ్లు దేశం కోస కష్టపడటం చాలా నచ్చింది. దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారు. నా వంతుగా దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే భాజపాలో చేరాను. సేవ చేయడం నాకు సంతోషాన్నిస్తుంది. భాజపా దేశం కోసం ఎంతో బాగా పనిచేస్తుందని నేను నమ్ముతున్నాను. అందుకే పార్టీలో చేరాను. బ్యాడ్మింటన్‌లో రాణిస్తూనే రాజకీయాల్లో కొనాసాగుతాను ."
-సైనా నెహ్వాల్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి