తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఖేల్​రత్న రేసులో శ్రీకాంత్, సాయి ప్రణీత్​ - అర్జున్ హెచ్ ఎస్ ప్రణయ్

బ్యాడ్మింటన్ క్రీడాకారులు కిదాంబి శ్రీకాంత్(Kidambi Srikanth), సాయి ప్రణీత్(Sai Praneeth) పేర్లను ఖేల్​రత్న(Khel Ratna) పురస్కారానికి సిఫార్సు చేసింది భారత బ్యాడ్మింటన్ సంఘం(BAI). అలాగే అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్​చంద్ అవార్డుల కోసం పేర్లను ప్రతిపాదించింది.

Sai Praneeth,Srikanth
సాయి ప్రణీత్, శ్రీకాంత్

By

Published : Jul 1, 2021, 2:19 PM IST

దేశంలోని క్రీడా పురస్కారాల కోసం సిఫార్సులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే క్రికెట్, ఫుట్​బాల్, హాకీ, ఆర్చరీ, అథ్లెటిక్స్ సంఘాలు వారివారి ప్రతిపాదనలను కేంద్రానికి పంపాయి. తాజాగా భారత బ్యాడ్మింటన్ సంఘం(Badminton Association of India) కూడా అవార్డుల కోసం పేర్లను సిఫార్సు చేసింది.

ఇందులో కిదాంబి శ్రీకాంత్(Kidambi Srikanth), సాయి ప్రణీత్​(Sai Praneeth) పేర్లను ఖేల్​రత్న కోసం ప్రతిపాదించింది. అలాగే అర్జున కోసం హెచ్​ఎస్ ప్రణయ్(HS Prannoy), ప్రణవ్ జెర్రీ, సమీర్ వర్మలను నామినేట్ చేసింది. ద్రోణాచార్య అవార్డు కోసం ఎస్.మురళీధరన్, పీయూ భాస్కర్​ను, ధ్యాన్​చంద్ పురస్కారానికి పీవీవీ లక్ష్మీ, లెరో డీ సాలను సిఫార్సు చేసింది.

2019లో ప్రపంచ ఛాంపియన్ షిప్​లో ప్రణీత్​ కాంస్యంతో మెరిశాడు. అలాగే టోక్యో ఒలింపిక్స్​ పురుషుల సింగిల్స్ విభాగంలో పోటీపడబోతున్న ఏకైక బ్యాడ్మింటన్ ప్లేయర్​గా నిలిచాడితడు. కాగా, 2017 నుంచి కెరీర్​లో ఒడుదొడుకుల్ని ఎదుర్కొంటున్నాడు శ్రీకాంత్.

ఇవీ చూడండి

ఖేల్​రత్న పురస్కారం కోసం అశ్విన్, మిథాలీ

ధోనీని తలపించిన షెఫాలీ.. ఔటైన తీరుపై వివాదం

ABOUT THE AUTHOR

...view details