తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆసియా బ్యాడ్మింటన్​​లో సైనా, సింధు ఓటమి - ASIAN BADMINTON CHAMPION SHIP

ఆసియా బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్​లో భారత్​ ఆట ముగిసింది . క్వార్టర్స్​లోనే సైనా, సింధు ఇంటి ముఖం పట్టారు. భారత్​కు ఈ సారి పతకం ఖాయమనుకున్న అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది.

ఆసియా బ్యాట్మింటన్​లో సైనా, సింధు ఓటమి

By

Published : Apr 26, 2019, 9:06 PM IST

చైనాలో జరుగుతున్న ఆసియాబ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్​లో భారత పోరు ముగిసింది. స్టార్ క్రీడాకారిణులు సైనా, సింధు, సమీర్ వర్మ క్వార్టర్స్​లో ఓడి ఇంటిముఖం పట్టారు. జపాన్​కు చెందిన యమగూచి చేతిలో 13-21, 23-21, 16-21 తేడాతో ఓటమి పాలైంది సైనా.

చైనాకు చెందిన కాయ్ యాన్యాన్​తో జరిగిన మ్యాచ్​లో 19-21, 9-21 పాయింట్ల తేడాతో సింధు ఓడిపోయింది. ఆమె చేతిలో సింధు ఓడిపోవడం ఇదే తొలిసారి.

పురుషుల సింగిల్స్​లో భారత్​కు చెందిన సమీర్ వర్మ.. రెండో సీడ్ షి యూకీ చేతిలో 10-21, 20-22 పాయింట్ల తేడాతో ఓడిపోయాడు.

ABOUT THE AUTHOR

...view details