తెలంగాణ

telangana

ETV Bharat / sports

చైనా ఓపెన్​ నుంచి సింధు, ప్రణయ్ ఔట్​ - ప్రణయ్​

చైనా ఓపెన్​లో తొలి రోజు భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. తొలి రౌండ్​లోనే పీవీ సింధు, ప్రణయ్ ఇంటిముఖం పట్టగా... మిక్స్​డ్ డబుల్స్​ జోడీ సాత్విక్ - అశ్విని.. కెనడా ద్వయం నెగ్గింది.

చైనా ఓపెన్​ నుంచి సింధు, ప్రణయ్ ఔట్​

By

Published : Nov 5, 2019, 11:06 AM IST

ఎన్నో అంచనాల నడుమ చైనాఓపెన్​లో బరిలోకి దిగిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరోసారి నిరాశ పరిచింది. మంగళవారం ప్రారంభమైన ఈ టోర్నీ తొలిరౌండ్​లో చైనీస్ తైపీ క్రీడాకారిణి పై యు పొ చేతిలో పరాజయం చెంది ఇంటిముఖం పట్టింది.

తనకంటే దిగువ ర్యాంకైన పై యుపై 13-21, 21-18, 19-21 తేడాతో ఓడింది. తొలి సెట్లో అంతగా ప్రభావం చూపని సింధు.. రెండో గేమ్​లో గెలిచింది. హోరాహోరీగా సాగిన మూడో సెట్లో ప్రత్యర్థే పైచేయి సాధించింది.

మిక్సడ్​ డబుల్స్​లో సాత్విక్ సాయిరాజ్ - అశ్విని పొన్నప్ప జోడీ శుభారంభం చేసింది. కెనడా ద్వయం హల్​బర్ట్ - జోస్ఫిన్​ వూపై నెగ్గింది. 21-19, 21-19 తేడాతో నెగ్గింది.

మరోవైపు పురుషుల సింగిల్స్​లో ప్రణయ్​ కూడా ఇంటిముఖం పట్టాడు. తొలి రౌండ్​లో డెన్మార్క్ ఆటగాడు రస్మస్ గెమ్కేపై 17-21, 18-21 తేడాతో వరుస సెట్లలో ఓడి నిరాశ పరిచాడు.

ఇదీ చదవండి: 15 ఏళ్ల విరాట్​కు.. కోహ్లీ స్వీయసందేశం..!

ABOUT THE AUTHOR

...view details