తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆల్​ఇంగ్లాండ్​ ఓపెన్​: సింధు విజయం- శ్రీకాంత్​, కశ్యప్​ ఔట్​ - Srikanth

ఆల్​ఇంగ్లాండ్​ ఓపెన్​లో తొలిరోజు భారత్​కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మహిళల సింగిల్స్ తొలి రౌండ్​​లో సింధు గెలిచింది. పురుషుల సింగిల్స్​లో శ్రీకాంత్​, కశ్యప్​ పరాజయం పాలయ్యారు.

Kidambi Srikanth, Parupalli Kashyap bow out
ఆల్​ఇంగ్లాండ్​ ఓపెన్​: సింధు విజయం- శ్రీకాంత్​, కశ్యప్​ ఔట్​

By

Published : Mar 17, 2021, 10:08 PM IST

Updated : Mar 17, 2021, 10:19 PM IST

ఆల్​ఇంగ్లాండ్​ బ్యాడ్మింటన్​ ఓపెన్​లో భారత షట్లర్లకు ఆదిలోనే పరాభవం ఎదురైంది. మహిళల సింగిల్స్​లో సింధు గెలిచినా.. పురుషుల సింగిల్స్​లో కిదాంబి శ్రీకాంత్​, పారుపల్లి కశ్యప్​ తొలి రౌండ్​లోనే ఓటమి పాలయ్యారు.

పీవీ సింధు.. మలేసియా షట్లర్​ సోనియాపై 21-11, 21-17 తేడాతో గెలిచి రెండో రౌండ్​కు వెళ్లింది.

శ్రీకాంత్​, కశ్యప్​..

పురుషుల సింగిల్స్​లో ఐర్లాండ్​ ఆటగాడు నట్​ గుయెన్​.. 21-11, 15-21, 21-12 తేడాతో శ్రీకాంత్​పై గెలుపొందాడు.

ప్రపంచ నెం.1 ఆటగాడు కెంటో మొమొటా చేతిలో వరుస సెట్లలో చిత్తయ్యాడు కశ్యప్​. 13-21, 20-22 తేడాతో ఓడాడు.

పురుషుల డబుల్స్​లో చిరాగ్​షెట్టి- సాత్విక్​ సాయిరాజ్​ జోడీ 21-7, 21-10 తేడాతో ఇంగ్లాండ్​ ద్వయంపై సులువుగా నెగ్గింది. ఈ మ్యాచ్​ 19 నిమిషాల్లోనే ముగియడం విశేషం.

కరోనా కలకలం..

టోర్నీకి ముందు తొలుత భారత శిబిరంలో కరోనా కలకలం రేగింది. ముగ్గురు ఆటగాళ్లకు కరోనా సోకిందంటూ వార్తలు వచ్చాయి. అయితే.. మరోసారి నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్​గా తేలగా షట్లర్లు ఆల్​ఇంగ్లాండ్​ టోర్నీలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ఇంగ్లాండ్​ టోర్నీకి లైన్ క్లియర్- భారత షట్లర్లకు నెగెటివ్

Last Updated : Mar 17, 2021, 10:19 PM IST

ABOUT THE AUTHOR

...view details