ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్‌లో భారత స్టార్ షట్లర్ సైనా సెహ్వాల్ మొదటి రౌండ్ నుంచే వెనుదిరిగింది. గాయం కారణంగా మ్యాచ్ మధ్యలోనే రిటైర్డ్ హర్ట్‌గా వైదొలిగింది. డెన్మార్క్‌కు చెందిన మియా బిచ్ఫెల్ట్తో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదటి సెట్‌ను 8-21తో కోల్పోయిన సైనా, రెండో సెట్లో 4-10తో వెనకబడిన క్రమంలో మ్యాచ్ నుంచి తప్పుకుంది.
ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ నుంచి సైనా ఔట్ - ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ సైనా నెహ్వాల్
ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కథ ముగిసింది. గాయం కారణంగా తొలి మ్యాచ్ మధ్యలోనే వెనుదిరిగింది.
సైనా
సైనా భర్త కశ్యప్ కూడా మొదటి రౌండ్లోనే వెనుదిరిగాడు. రెండుసార్లు ప్రపంచ విజేత కెంటో మొమోటో చేతిలో 13-21, 20-22 తేడాతో ఓడి ఇంటిముఖం పట్టాడు. అలాగే మరో ఆటగాడు శ్రీకాంత్ కూడా తొలి రౌండ్లోనే ఓటమి చెందాడు. మరో క్రీడాకారిణి సింధు మాత్రం రెండో రౌండ్లోకి ప్రవేశించింది.
Last Updated : Mar 18, 2021, 9:18 AM IST