బుధవారం నుంచి ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ప్రారంభం కానుంది. 120 ఏళ్ల చరిత్ర గల ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌పై భారత షట్లర్లు సింధు, సైనా కన్నేశారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ర్యాంకింగ్స్‌లో తొలి 32 మంది షట్లర్లే అర్హత సాధించే ఈ టోర్నీలో భారత నుంచి సింధు, సైనాతో పాటు కిదాంబి శ్రీకాంత్ ఎంపికయ్యాడు.
తొలి మ్యాచ్లోదక్షిణకొరియాకు చెందిన ఐదో సీడ్ క్రీడాకారిణి జీ హ్యూతో ఆడనుంది సింధు. స్కాట్లాండ్కు చెందిన క్రిస్టి గిల్మౌర్తో సైనా తలపడనుంది. కిదాంబి శ్రీకాంత్ డెన్మార్క్‌కు చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్ విక్టర్‌ను ఢీకొట్టనున్నాడు.
గత ఏడాది ఆడిన అన్ని ఈవెంట్లలోనూ రజతాలతో సరిపెట్టుకుంది సింధు. ఈ ఏడాది ఇండోనేసియా మాస్టర్ టైటిల్ నెగ్గి, జాతీయ క్రీడల్లో ఫైనల్స్ చేరడం లాంటి సానుకూల అంశాలతో ఇంగ్లీష్ టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది.