చైనా, హాంకాంగ్, కొరియా మాస్టర్స్.. ఇలా వరుస టోర్నీల్లో విఫలమైన భారత షట్లర్లు కొంతమంది అంతర్జాతీయ మ్యాచ్‌లపై మరింత దృష్టిపెట్టారు. ఇందుకోసం జనవరి నుంచి జరగనున్న బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్‌కు(పీబీఎల్) దూరం కావాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే సైనా నెహ్వాల్ ఈ టోర్నీ నుంచి తప్పుకోగా, తాజాగా ఈ జాబితాలోకి కిదాంబి శ్రీకాంత్ చేరాడు.
"ఇది చాలా కఠినమైన నిర్ణయం. నాపై చాలా అంచనాలు ఉన్నాయి. వాటిని నెరవేర్చాల్సిన అవసరం ఉంది. అందుకే అంతర్జాతీయ టోర్నీలపై దృష్టిపెట్టి, పీబీఎల్‌కు దూరం కావాలని నిర్ణయించుకున్నా. ఈ సీజన్లో బెంగళూరు ర్యాప్టర్స్ బాగా ఆడాలని కోరుకుంటున్నా.. ఆల్ ద బెస్ట్" -కిదాంబి శ్రీకాంత్, భారత షట్లర్
2017లో వరుసగా నాలుగు టైటిల్స్ నెగ్గిన శ్రీకాంత్, తర్వాత నుంచి వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. ఈ ఏడాది ఇండియా ఓపెన్‌లో ఫైనల్స్‌కు వెళ్లడం మినహా మిగతా వాటిల్లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు.