తెలంగాణ

telangana

ETV Bharat / sports

దక్షిణాసియా క్రీడల్లో భారత బ్యాడ్మింటన్ జట్లకు స్వర్ణాలు - 13th South Asian Games

నేపాల్ వేదికగా జరుగుతున్న దక్షిణాసియా క్రీడల్లో(శాగ్​) భారత బ్యాడ్మింటన్ పురుషుల, మహిళల జట్లు స్వర్ణాలను సొంతం చేసుకున్నాయి. ఇప్పటివరకు భారత్​ 11 పతకాలు నెగ్గింది. తైక్వాండోలో ఒకటి, ట్రైథ్లాన్​లో మరో గోల్డ్ గెల్చుకుంది.

13th South Asian Games
దక్షిణాసియా క్రీడల్లో భారత బ్యాడ్మింటన్ జట్లకు స్వర్ణాలు

By

Published : Dec 3, 2019, 5:51 AM IST

దక్షిణాసియా క్రీడల్లో భారత బ్యాడ్మింటన్ జట్లు స్వర్ణాలను నెగ్గాయి. కిదాంబి శ్రీకాంత్ సారథ్యంలోని పురుషుల జట్టు ఫైనల్లో శ్రీలంక టీమ్​ను 3-1 తేడాతో ఓడించి పసిడి కైవసం చేసుకుంది. మహిళల జట్టు కూడా తుదిపోరులో శ్రీలంకపైనే 3-0 తేడాతో గెలిచి బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది.

ప్రారంభ మ్యాచ్​లో శ్రీలంక ఆటగాడు దినుక కరుణరత్నేపై 17-21, 21-15, 21-11 తేడాతో విజయం సాధించాడు శ్రీకాంత్. అనంతరం సిరిల్ వర్మ.. సచిన్ ప్రేమాషన్​పై 21-17, 11-5 తేడాతో నెగ్గి ఆధిక్యాన్ని పెంచాడు. మధ్యలో ప్రత్యర్థి రిటైర్ట్ హర్ట్​గా వెనుదిరిగాడు.

భారత డబుల్స్ జోడీ అరుణ్ జార్జ్ - సన్యామ్ శుక్లా .. 18-21, 21-14, 11-21 తేడాతో శ్రీలంక ద్వయం సచిన్- తరిందు ద్వయంపై ఓడింది. అయితే కృష్ణ ప్రసాద్ - ధ్రువ్​.. మరో శ్రీలంక జోడీపై విజయం సాధించి స్వర్ణాన్ని కైవసం చేసుకున్నారు.

మహిళల ఫైనల్లో అస్మతా చలిహా, అకర్షి కశ్యప్, గాయత్రి గోపీచంద్ సింగిల్స్ విభాగంలో విజయం సాధించారు. ఫలితంగా 3-0 తేడాతో భారత మహిళల జట్టు గెలిచింది.

ఇదీచదవండి: ఈసారి ఐపీఎల్ వేలంలో 971 మంది క్రికెటర్లు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details