వాకింగ్‌లో ప్రపంచ రికార్డు - 50 కిలోమీటర్ల నడక
50 మీటర్ల నడకలో చైనా క్రీడాకారిణి లియు హంగ్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. చైనీస్ రేస్ వాక్ గ్రాండ్ ప్రిక్స్‌లో పాల్గొన్న ఈమె...3 గంటల 59 నిముషాల 15 సెకన్లలో రేసు పూర్తిచేసింది.
వాకింగ్‌లో వరల్డ్ రికార్డ్
మహిళల 50 కిలోమీటర్ల నడకలో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. 50 కిలోమీటర్ల దూరాన్ని లియు హాంగ్ 3 గంటల 59 నిమిషాల 15 సెకన్లలోనే చేరుకుంది.
- ఇప్పటివరకు 4 గంటల 4 నిమిషాల 36 సెకన్లతో ఈ రికార్డు లియాంగ్ రుయి (చైనా) పేరిట ఉండేది. దీనిని అధిగమించి 50 కిలో మీటర్ల గమ్యాన్ని తక్కువ సమయంలో చేరుకున్న తొలి క్రీడాకారిణిగా లియు గుర్తింపు పొందింది. 31 ఏళ్ల లియు హాంగ్ 2016 రియో ఒలింపిక్స్‌లో 20 కిలోమీటర్ల విభాగంలో స్వర్ణం సాధించింది.