తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రియాంక చోప్రా 'మల్టీమిలియన్ డాలర్' ఒప్పందం - ప్రియాంక చోప్రా వార్తలు

అమెజాన్​ ప్రైమ్​ వీడియోతో భాగస్వామిగా మారిన నటి ప్రియాంక చోప్రా.. పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించడం సహా నిర్మాతగానూ వ్యవహరించనుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుని ఆనందం వ్యక్తం చేసింది.

ప్రియాంక చోప్రా 'మల్టీమిలియన్ డాలర్' ఒప్పందం
ప్రియాంక చోప్రా

By

Published : Jul 1, 2020, 1:26 PM IST

అంతర్జాతీయ నటి ప్రియాంక చోప్రా.. అమెజాన్​ ప్రైమ్ వీడియోతో 'మల్టీమిలియన్ డాలర్' ఒప్పందం కుదుర్చుకుంది. రానున్న రెండేళ్లకుగాను పలు టీవీషోలు చేసిపెట్టనుందీ భామ. ఈ విషయమై ఆనందం వ్యక్తం చేస్తూ ఇన్​స్టాలో పోస్ట్ పెట్టింది.

"మీతో(అభిమానులు) ఈ ఆనందకర విషయాన్ని పంచుకోవాలని అనుకుంటున్నాను. నాతో భాగస్వామిగా మారిన అమెజాన్​ బృందానికి, అద్భుతమైన ప్రతిభను అందిస్తామని నన్ను నమ్మినందుకు చాలా పెద్ద థ్యాంక్స్" -ప్రియాంక చోప్రా, నటి-నిర్మాత

ఇప్పటికే బాలీవుడ్​తో పాటు హాలీవుడ్​లోనూ నటిస్తున్న ప్రియాంక చోప్రా.. 2015లో పర్పుల్ పెబ్బల్ పిక్చర్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను స్థాపించింది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన నటుల్ని, అద్భుతమైన కథలను వీక్షకులకు అందిస్తానని చెప్పిందీ భామ. ఇన్నాళ్లు తనకు అండగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది ప్రియాంక.

అమెజాన్​తో డీల్​లో భాగంగా ప్రియాంక.. థ్రిల్లర్ సిరీస్ 'సిటాడెల్'లో గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ రిచర్డ్ మేడన్​తో కలిసి నటించనుంది. తన భర్త నిక్ జోనస్ నిర్మిస్తున్న 'సంగీత్' అనే వెబ్​సిరీస్​లో ప్రధాన పాత్ర పోషించనుంది. 'ఎమ్​ఏ ఆనంద షీలా' అనే సినిమాలో హీరోయిన్​గా నటించనుంది. 'వైల్డ్ వైల్డ్ కంట్రీ' అనే డాక్యుమెంట్ సిరీస్​ ఆధారంగా దీనిని తెరకెక్కించనున్నారు.

ఇవే కాకుండా నెట్​ఫ్లిక్స్​లోనూ రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది ప్రియాంక చోప్రా. 'వుయ్ కెన్ బీ హీరోస్' అనే సూపర్​హీరో సినిమాతో పాటు రాజ్​కుమార్ రావ్​తో 'ద వైట్ టైగర్'లో ప్రధాన పాత్రలు చేస్తోంది. దీనితో పాటే 'ద మ్యాట్రిక్స్ 4'లోనూ హీరోయిన్​గా కనిపించనుంది. కరోనా ప్రభావంతో ఈ చిత్ర షూటింగ్​ మధ్యలో నిలిచిపోయింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details