'ఈ నగరానికి ఏమైంది' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు పొంది.. ఆ తర్వాత 'ఫలక్‌నుమా దాస్' సినిమాతో దర్శకుడిగానూ మెప్పించాడు యంగ్ హీరో విశ్వక్సేన్. ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో విశ్వక్ సేన్.. తన సినీ ప్రయాణంలోని విశేషాలను పంచుకున్నాడు.
విజయ్‌ని అనలేదు!
'ఫలక్‌నుమా దాస్' విడుదల సమయంలో తనకు మధ్య విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య జరిగిన గొడవ గురించి 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో స్పష్టత ఇచ్చాడు. అయితే ఆ విషయంలో విజయ్ ఫ్యాన్స్ తనను అపార్థం చేసుకున్నారని తెలిపాడు. 'ఫలక్‌నుమా దాస్' ప్రీ-రిలీజ్ ఈవెంట్లో.."నన్ను ఒకడు లేపాల్సిన అవసరం లేదు.. నన్ను నేనే లేపుకుంటా?" అని తాను అన్న మాట విజయ్ దేవరకొండను ఉద్దేశించి కాదని తెలిపాడు. అయితే తామిద్దరి మధ్య స్నేహం, శత్రుత్వం రెండూ లేవని విశ్వక్సేన్ చెప్పాడు.
ఇదీ చూడండి:తండ్రిని కోల్పోయిన విద్యార్థికి అండగా సల్మాన్