మద్యం తాగేవారికి సందర్భంతో పని లేదు. ఎప్పుడూ తాగుతూ సరదాగా ఎంజాయ్ చేస్తారు. ఈ నేపథ్యంలోనే కిక్ ఎక్కువయ్యో.. పొరపాటునో మద్యం కింద పడేస్తారు లేకుంటే పారబోస్తారు. ఏముందలే అని మరొకటి కొని తాగుతారు. కానీ ఇలా చేస్తే ఐదేళ్లు వరకు మద్యం తాగకూడదనే నిబంధన ఉంది. ఇది మద్యం ప్రియులకు ఒక రకంగా శిక్ష లాంటిది. భయపడకండి.. ఈ నిబంధన మనం దేశంలో కాదులెండి.. విక్టోరియాలో ఉంది. అక్కడ విచ్చలవిడిగా మద్యం దొరుకుతుంది. దీంతో మద్యం పడేస్తారని ఈ రూల్ పెట్టారట.
ఈటీవీలో ప్రసారమయ్యే.. వినోదాన్ని విజ్ఞాన్ని పంచే కార్యక్రమంగా పేరున్న క్యాష్ ప్రోగ్రామ్లో ఈ ప్రశ్నను వ్యాఖ్యత సుమ అడిగారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన నటులు బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, సమీర్, రాజా రవీంద్ర హాస్యాస్పదంగా సమాధానాలిచ్చారు. ఈ ప్రశ్నకు బ్రహ్మాజీ.. సరిగ్గా బదులిచ్చారు. ఈ క్రమంలో మరిన్ని ప్రశ్నలు సంధించారు సుమ.
ప్రశ్న: మనిషి కళ్లు సుమారుగా ఎన్ని రంగులను చూడగలవు
- జవాబు: 1 కోటి