Pushpa unstoppable episode: 'ఇంటర్‌స్టెల్లర్' దర్శకులతో ఇదే గొడవయ్యా. సినిమాలూ అలాగే ఉంటాయి. గెటప్‌లూ అలానే ఉంటాయి' అంటూ సుకుమార్‌ను ఆటపట్టించారు అగ్ర కథానాయకుడు బాలకృష్ణ (bala krishna). ఆయన వ్యాఖ్యాతగా ప్రముఖ ఓటీటీ ఆహాలో ప్రసారమవుతున్న షో 'అన్‌స్టాపబుల్' (Unstoppable). ఈ కార్యక్రమానికి 'పుష్ప' (Pushpa) టీమ్ అల్లు అర్జున్ (Allu arjun), రష్మిక(Rashmika), దర్శకుడు సుకుమార్ (sukumar) వచ్చి సందడి చేశారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ- సుకుమార్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. 'మీరు నాకు చాలా పరిచయం కానీ, నేను మీకు పరిచయం తక్కువ' అని సుకుమార్ అంటే 'ఎలాగో చెప్పండి' అని బాలకృష్ణ ఎదురు ప్రశ్నించారు. 'ప్రత్యక్షంగా కాకపోయినా, ఎప్పుడూ మిమ్మల్ని చూస్తూ పెరిగాం కాబట్టి, మీరు మాకు బాగా పరిచయం' అని అనగానే 'ఇంటర్‌స్టెల్లర్ కబర్లు చెప్పకమ్మా' అంటూ బాలయ్య పంచ్‌డైలాగ్ వేశారు. దీంతో సుకుమార్ నవ్వాపుకోలేకపోయారు.