బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు మరో మలుపు తిరిగింది. నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్ చేసిన కామెంట్లు అవాస్తవమని... సాయికృష్ణ రెడ్డి అన్నారు. శ్రావణి కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని తెలిపారు. ఆమె ఆత్మహత్యకు కారణం తాను కాదని వెల్లడించారు.
బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో మరో మలుపు - నిందితుడు దేవరాజ్ వార్తలు
బుల్లితెర నటి శ్రావణి కుటంబానికి స్నేహితుడిని మాత్రమే అని... ఆమె జీవితాన్ని కాపాడేందుకు ప్రయత్నించానని సాయి కృష్ణా రెడ్డి వెల్లడించారు. దేవరాజ్ చేసిన ఆరోపణలన్నీ అసత్యాలని పేర్కొన్నారు.
బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో మరో మలుపు
శ్రావణి ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి... ఆమె కుటుంబంతోనే ఉన్నానని వెల్లడించారు. దేవారాజ్ వల్లే శ్రావణి ఇబ్బందులు ఎదుర్కొందని... తన దగ్గర ఆధారాలున్నాయని పేర్కొన్నారు. దేవరాజ్ తనను బెదిరించి.. అతనికి అనుగుణంగా ఆమెతో మాట్లాడించే వాడని ఆరోపించారు.
ఇదీ చూడండి: 'శ్రావణి ఆత్మహత్యకు కారణం వాళ్లే... ఆధారాలున్నాయ్'