తనపై లైంగిక దాడి జరిగిందని హిందీ టీవీ నటి, పోలీసులను ఆశ్రయించింది. కాస్టింగ్ డైరెక్టర్ ఆయుష్ తివారీ.. తనపై అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. ఈ విషయమై సెక్షన్ 376 కింద అతడిపై ముంబయిలోని వెర్సోవా పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.
దర్శకుడు రేప్ చేశాడని టీవీ నటి ఆరోపణ - ఆయుష్ తివారి వార్తలు
పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టిన ఓ కాస్టింగ్ డైరెక్టర్.. తనపై రెండేళ్లుగా పలుమార్లు అత్యాచారం జరిపాడని బుల్లితెర నటి ఆరోపించింది. సదరు డైరెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
![దర్శకుడు రేప్ చేశాడని టీవీ నటి ఆరోపణ TV actress accuses casting director of rape in Mumbai](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9710801-284-9710801-1606711392326.jpg)
డైరెక్టర్ అత్యాచారం చేశాడని బుల్లితెర నటి ఆరోపణ
వివాహం చేసుకుంటానని మభ్యపెట్టి, గత రెండేళ్లుగా తనపై అత్యాచారం చేశాడని సదరు నటి, ఫిర్యాదులో పేర్కొన్నట్లు వెర్సోవా పోలీసు అధికారి వెల్లడించారు. నవంబరు 26న కాస్టింగ్ డైరెక్టర్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రాథమిక దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:గాంధీని హత్య చేసిన గాడ్సేపై సినిమా