తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'జబర్దస్త్'​ టీమ్​లకు భారీ షాకిచ్చిన ఆ ఇద్దరు! - సునామీ సుధాకర్​ మిమిక్రీ సింగింగ్

'శ్రీదేవి డ్రామా కంపెనీ'(Sridevi Darma Company) షోలో కొత్త ట్విస్ట్! ఇప్పటివరకు తమ కామెడీతో హాస్యాన్ని పంచిన 'జబర్దస్త్​' కమెడియన్స్​.. ఈ కార్యక్రమంలో ఎవ్వరికి తెలియని తమలోని టాలెంట్లను బయటపెట్టారు. ఆ ప్రదర్శన చూసి ఆశ్చర్యపోవడం తమ తోటి నటుల వంతు అయ్యింది. అయితే ఆ ఇద్దరు కమెడియన్స్​ ఏఏ టాలెంట్లతో ఆకట్టుకున్నారు? వారి చేసిన ఆ కళా ప్రదర్శనలేవో? తెలుసుకుందాం.

Tsunami Sudhakar - Jabardast Ramu performances in Sridevi Darma Company
'జబర్దస్త్'​ టీమ్​లకు భారీ షాక్​ ఇచ్చిన ఆ ఇద్దరు!

By

Published : Jul 12, 2021, 10:05 AM IST

Updated : Jul 12, 2021, 11:47 AM IST

హాస్యనటులు అంటే ప్రేక్షకులకు హాస్యాన్ని పంచేవారు. ఫర్​ ఏ ఛేంజ్​ వారిలో ఎవరికి తెలియని అసమాన ప్రతిభలూ ఉంటూనే ఉంటాయి. సందర్భానుసారం వాటిని బయటపెడుతుంటారు. ఉదాహరణకు ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందంలో చిత్రకారుడూ ఉన్నారు. లాక్​డౌన్​లో ఆయన అనేక చిత్రాలను గీసి.. అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇదే విధంగా కమెడియన్స్​లో ఎవ్వరికీ తెలియని టాలెంట్​ను బయటపెట్టే పనిలో పడింది 'శ్రీదేవి డ్రామా కంపెనీ'(Sridevi Darma Company). ప్రతి ఆదివారం ఈటీవీలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో ఇద్దరు జబర్దస్త్​ కమెడియన్స్​ తమలోని సింగింగ్​, డ్యాన్సింగ్​ టాలెంట్లతో తమ టీమ్​మెంబర్స్​ను షాక్​కు గురిచేశారు. వారెవరో తెలుసుకుందాం.

మిమిక్రీతో పాటలు

'చలాకి చంటి' టీమ్​లో కమెడియన్​గా గుర్తింపు పొంది.. ఆ తర్వాత తనదైన వినోదాన్ని పంచుతూ, ప్రస్తుతం టీమ్​ లీడర్​ స్థాయికి ఎదిగాడు సునామీ సుధాకర్​. అప్పటివరకు తనదైన మార్క్​ కామెడీతో, గాలిపటాల స్టెప్పుల​తో ప్రేక్షకులను అలరించిన సుధాకర్​.. ఇప్పుడు తన టీమ్​ మెంబర్స్​కు తెలియని టాలెంట్​ను బయటపెట్టాడు. ఈటీవీలో ప్రసారమవుతోన్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' కార్యక్రమంలో తనలోని సింగర్​ను పరిచయం చేశాడు. రాజబాబు, అల్లూరి రామలింగయ్య, సిల్క్​స్మిత, నాడా వెంకటేశ్వరరావు గొంతులతో ఆనాటి పాటలు పాడి అలరించాడు. తనలోని తెలియని టాలెంట్​ను తెలుసుకున్న తోటి కమెడియన్స్​ సుధాకర్​ను అభినందించారు.

తొలిసారి కొరియోగ్రఫీ..

'అదిరే అభి' టీమ్​లో నటించే రాము.. తొలిసారి కొరియోగ్రాఫర్​ అవతారమెత్తాడు. ఆదివారం ప్రసారమైన 'శ్రీదేవి డ్రామా కంపెనీ' కార్యక్రమంలో ఓ సాంగ్​కు కొరియోగ్రఫీ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. 'కంత్రి' సినిమాలోని 'ఐ గో క్రేజీ' సాంగ్​కు స్టెప్పులు సమకూర్చగా.. అందులో పండు, సత్య డ్యాన్స్​ చేశారు. సునామీ సుధాకర్​, రాము చేసిన ప్రదర్శనలు చూసిన తర్వాత వీరిద్దరూ మరింత ఎత్తుకు ఎదగాలని తోటి నటీనటులు అభినందించారు.

ఇదీ చూడండి..'పూరీ జగన్నాథ్​ ఆఫర్​ను అందుకే వద్దన్నా!'

Last Updated : Jul 12, 2021, 11:47 AM IST

ABOUT THE AUTHOR

...view details