సామాన్యుడికి వినోదాన్ని పంచే సినిమా థియేటర్లు తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి తెరుచుకున్నాయి. తెలంగాణలో 100 శాతం సామర్థ్యంతో సినిమాల ప్రదర్శన కొనసాగుతుండగా.. ఆంధ్రప్రదేశ్లో 50 శాతం అనుమతితో మూడు ఆటలను ప్రదర్శిస్తున్నారు. అయితే సినిమా థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య అంతంతమాత్రంగానే ఉంది. కరోనా దృష్ట్యా పెద్దగా జనాలు తొలిరోజు సినిమా థియేటర్లవైపు చూడటం లేదు. ఈ క్రమంలో హైదరాబాద్ లో సింగిల్ థియేటర్లలో మందడికొడి ప్రేక్షకులు ఉండగా.. పలు మల్టిఫ్లెక్స్ థియేటర్లలో సందడి కనిపించింది.
తెలుగు రాష్ట్రాల థియేటర్లలో సందడి షురూ - తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు
ఇరు తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి థియేటర్లు తిరిగి తెరుచుకున్నాయి. సినిమాహాళ్లు తెలంగాణలో వందశాతం సీటింగ్ సామర్థ్యంతో ప్రదర్శన కొనసాగుతుండగా.. ఆంధ్రప్రదేశ్లో 50 శాతం అనుమతితో మూడు షోలను ప్రదర్శిస్తున్నారు.
అటు ఆంధ్రప్రదేశ్లో టికెట్ ధరల విషయంలో ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో పలు జిల్లాల్లోని ప్రదర్శనకారులు థియేటర్లను తెరవలేదు. కరోనా మెదటి, రెండు దశల్లో దాదాపు 12 నెలలుగా మూతపడి ఉన్న థియేటర్లు ఆర్థికంగా చితికిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం పలు రాయితీలు ఇచ్చి ఆదుకోగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ప్రదర్శనకారుల చర్చలు కొనసాగుతున్నాయి. ఈ వారం రోజులు గడిస్తే కానీ ప్రేక్షకుల రద్దీ పెరిగే అవకాశం ఉందని పలువురు ఎగ్జిబిటర్లు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చూడండి..Thimmarusu Review: సత్యదేవ్ 'తిమ్మరుసు' ఎలా ఉంది?