తెలంగాణ

telangana

ETV Bharat / sitara

The Family Man 2: 'ఫ్యామిలీ మ్యాన్' మూడో సీజన్ కథ అదే - The Family Man 2 review

ఇటీవల వచ్చిన రెండో సీజన్​తో 'ఫ్యామిలీ మ్యాన్' అలరిస్తుండగా, మూడో సీజన్​కు సంబంధించిన హింట్​ రెండో సీజన్​ చివర్లో చిత్రబృందం ఇచ్చేసింది. దీంతో ప్రేక్షకుల్లో మళ్లీ అంచనాలు పెరిగిపోతున్నాయి.

The Family Man 2
'ఫ్యామిలీ మ్యాన్' మూడో సీజన్

By

Published : Jun 5, 2021, 6:16 PM IST

శుక్రవారం విడుదలైన 'ఫ్యామిలీమ్యాన్‌: సీజన్‌2' ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. తొలి సిరీస్‌కు దీటుగా రాజ్‌, డీకే రెండో భాగాన్ని తీర్చిదిద్దిన విధానం కట్టిపడేస్తోంది. శ్రీకాంత్‌ తివారిగా మనోజ్‌ బాజ్‌పాయ్‌, రాజీ అలియాస్‌ రాజ్యలక్ష్మిగా సమంత తమ పాత్రల్లో జీవించారు. మొదటి నుంచి చివరి వరకూ ఉత్కంఠ రేపే కథ, కథనాలతో తెరకెక్కిన ఈ సిరీస్‌ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. చూసిన వాళ్లందరూ సీజన్‌ను ప్రశంసలతో ముంచెత్తుతూనే 'ఫ్యామిలీమ్యాన్‌: సీజన్‌3' గురించే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే రెండో భాగం ముగింపులోనే అందుకు సంబంధించిన హిట్‌ ఇచ్చేసింది ఫ్యామిలీమ్యాన్‌ టీమ్‌.

మొదటి భాగం ఉగ్రవాదం(పాకిస్థాన్‌), రెండో భాగం తమిళ రెబల్స్‌(శ్రీలంక) నేపథ్యంలో తీర్చిదిద్దగా, మూడో భాగం చైనాకు నుంచి వచ్చే ముప్పును శ్రీకాంత్‌ తివారీ అండ్‌ టీమ్‌ ఎలా ఎదుర్కోబోతోందో చూపించనున్నారు. కరోనా కష్టకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత్‌పై దాడి చేసేందుకు చైనా కుట్ర పన్నుతుంది. చైనాకు చెందిన ఓ వ్యక్తి తన ల్యాప్‌టాప్‌ ద్వారా గుర్తు తెలియని వ్యక్తితో చాట్‌ చేస్తుంటాడు. "ప్రాజెక్ట్‌ గువాన్‌ యు' ముందుకు తీసుకెళ్దామా సర్‌" అని ఇవతలి వ్యక్తి అడగ్గా, 'ప్రాజెక్టు గువాన్‌ యు' ముందుకు వెళ్లండి సోల్జర్‌' అని సమాధానం వస్తుంది. మరి సీజన్‌-3లో చైనీస్‌ ట్రూప్స్‌తో టాస్క్‌ ఎలాంటి పోరాటం చేస్తుందో చూడాలి. రెండో భాగంలో సమంత లీడ్‌ రోల్‌ చేసింది. మరి రాబోయే సీజన్‌-3లో కొత్తగా ఎవరు వస్తారో చూడాలి?

ఇది చదవండి:The Family Man 2 Review: సమంత పాత్రతో డబుల్ థ్రిల్లింగ్!

ABOUT THE AUTHOR

...view details