ఓటీటీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న 'ది ఫ్యామిలీమ్యాన్ 2' వెబ్‌సిరీస్ విడుదలకు రంగం సిద్ధమైంది. శుక్రవారం(జూన్ 4) అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే ఈ సిరీస్ రిలీజ్‌కు ముందే కొన్ని వివాదాల్లో చిక్కుకుంది. తమిళులకు మనోభావాలు దెబ్బతీసే విధంగా ట్రైలర్లో సన్నివేశాలు తమిళనాడులో ఇటీవలే కొన్ని ఆందోళనలు జరిగాయి. ఈ నేపథ్యం వెబ్‌సిరీస్ రిలీజ్‌ను ఆపేయాలని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం సహ పలువురు కేంద్రప్రభుత్వాన్ని కోరారు.
అయితే ఈ సిరీస్‌లోని పాత్రలు కానీ, కథ ద్వారా ఎవర్ని కించపరచబోమని దర్శకనిర్మాతలు స్పష్టం చేశారు. ఓ సారి వెబ్‌సిరీస్ చూసిన తర్వాత ఓ నిర్ణయానికి రావాలంటూ ఆందోళకారులను కోరారు. ఇలాంటి ఉద్రిక్తతల మధ్య రిలీజ్ అవుతోన్న ఈ సిరీస్ ప్రేక్షకులను ఏ విధంగా మెప్పించగలదో? అనే ఉత్కంఠ మొదలైంది. ఈ ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది.