తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కార్పొరేటర్‌గా సుడిగాలి సుధీర్‌! - extra jabardasth

Extra Jabardasth: ఎక్​ట్రా జబర్దస్త్​ లేటెస్ట్​ ప్రోమో విడుదలై అలరిస్తోంది. సుడిగాలి సుధీర్‌ టీమ్‌ 'కార్పొరేటర్‌' స్కిట్‌తో హంగామా చేయగా, గెటప్‌ శ్రీనుకి ఎంతో పేరుతీసుకొచ్చిన పాత్రను ఫైమా ఇమిటేట్‌ చేసి ఆకట్టుకుంది.

extra jabardasth latest episode promo
ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ ప్రోమో

By

Published : Dec 23, 2021, 1:59 PM IST

'ఈటీవీ' వేదికగా ప్రేక్షకులకు నాన్‌స్టాప్‌ నవ్వులు పంచే కార్యక్రమం 'ఎక్స్‌ట్రా జబర్దస్త్‌'. ఎప్పటిలానే ఈవారం గిలిగింతలు పెట్టేందుకు సిద్ధమైంది. తాజా ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో నెట్టింట విడుదలై సందడి చేస్తోంది. సుడిగాలి సుధీర్‌ టీమ్‌ 'కార్పొరేటర్‌' స్కిట్‌తో హంగామా చేసింది. భార్య, అత్త మధ్య నలిగే వ్యక్తిగా రాకేశ్‌ నవ్వులు పంచాడు. ఇదే స్కిట్‌లో 'ఢీ' ఫేమ్‌ పండు ఎంట్రీ ప్రత్యేకంగా నిలిచింది.

విమాన ప్రయాణంలో ఇమ్మాన్యుయేల్‌, బుల్లెట్‌ భాస్కర్‌, ఫైమా, వర్ష చేసిన అల్లరి చూస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే. 'లేడీస్‌ స్పెషల్‌ స్కిట్‌'తో రోహిణి, ఫైమా, పవిత్ర నవ్వుల వర్షం కురిపించారు. గెటప్‌ శ్రీనుకి ఎంతో పేరుతీసుకొచ్చిన పాత్రను ఫైమా ఇమిటేట్‌ చేసి ఆకట్టుకుంది.

ఇదీ చూడండి:జబర్దస్త్​ 'సుడిగాలి సుధీర్' టీమ్​ సంచలన నిర్ణయం- ఇదే లాస్ట్!

ABOUT THE AUTHOR

...view details