తెలంగాణ

telangana

ETV Bharat / sitara

60 ఏళ్ల మహిళగా నటిస్తున్న తాప్సీ - ప్రకాశీ

తాప్సీ 'సాండ్ కీ ఆంఖ్' చిత్రంలో నటిస్తోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కథ తన హృదయాన్ని హత్తుకుందని తాప్సీ చెబుతోంది. ఈ చిత్రంలో 60 ఏళ్ల మహిళగా నటిస్తోందీ దిల్లీ భామ.

తాప్సీ

By

Published : Apr 7, 2019, 5:40 PM IST

పింక్​, ముల్క్, బద్లా లాంటి చిత్రాలతో బాలీవుడ్​లో గుర్తింపు తెచ్చుకుంది తాప్సీ. ప్రస్తుతం'సాండ్ కీ ఆంఖ్' అనే చిత్రంలో నటిస్తోంది. ప్రపంచ వయోధిక షూటర్లుగా పేరు గాంచిన చాంద్రో, ప్రకాషీ తోమర్​ల జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. కథ హృదయాన్ని హత్తుకునేలా ఉందని సినిమాపై ప్రేమను వ్యక్తపరిచిందీ దిల్లీ భామ. ఈ చిత్రంలో తాప్సీతో పాటు భూమి పడ్నేకర్​ కూడా నటిస్తోంది.

తాప్సీ

ఉత్తరప్రదేశ్​లో ఓ చిన్న గ్రామానికి చెందిన చాంద్రో, ప్రకాషీ అనే మహిళలు జాతీయ స్థాయి షూటింగ్​లో సత్తాచాటారు. చాంద్రో 30 జాతీయ ఛాంపియన్​షిప్​లలో సత్తా చాటి అత్యధిక వయసు గల షూటర్​గా పేరు గడించింది. ప్రకాషీ 25 పైగా టైటిల్స్​ నెగ్గి రెండో వయోధిక షూటర్​గా నిలిచింది.

"ఈ సినిమా నేను ఎంచుకునే కథలకు విభిన్నంగా ఉన్నా.. కథ మాత్రం నా హృదయాన్ని హత్తుకుంది. ఇంతకంటే ఏం చెప్పలేను. ఈ చిత్రంతో ప్రేక్షకులు మమ్మల్ని చాలా కాలం గుర్తుపెట్టుకుంటారు. ఈ సినిమా కోసం షూటింగ్ కూడా నేర్చుకున్నాను. 60 ఏళ్ల మహిళ పాత్రలో నటించడం చాలా కష్టంగా అనిపించింది" - తాప్సీ

సినిమాలో 85 శాతం వరకు 60ఏళ్ల మహిళగానే తాప్సీ కనిపించనుంది. అనురాగ్ కశ్యప్, నిధి పామర్ 'సాండ్ కీ ఆంఖ్' చిత్రానికి నిర్మాతలు. తుషార్ హిరాన్దానీ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాతో పాటు అక్షయ్ కుమార్​తో 'మిషన్ మంగల్', 'గేమ్ ఓవర్' చిత్రాల్లోనూ తాప్సీ నటిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details