చిన్నతనంలో స్నేహితుడు ప్రోద్బలంతోనే తాను రచయితగా మారానని తనికెళ్ల భరణి చెప్పారు. అప్పట్లో దొంగతనాలు కూడా చేశానని అన్నారు. 'ఆలీతో సరదాగా' టాక్ షోకు వచ్చిన ఆయన.. ఈ విషయాలతో పాటు పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. ఈ ఎపిసోడ్ ప్రోమో మంగళవారం విడుదలైంది.
బాలుతో అందుకే పాటలు పాడించలేదు: తనికెళ్ల భరణి - ఆలీతో సరదాగా లేటేస్ట్ ఎపిసోడ్
'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి వచ్చిన తనికెళ్ల భరణి... తన జీవితం, సినీ కెరీర్ గురించి పలు ఆసక్తికర సంగుతుల్ని పంచుకున్నాడు. ప్రోమో విడుదలైంది.
ఎస్పీ బాలు తనికెళ్ల భరణి
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో 'మిథునం' సినిమా తీసిన భరణి.. అందులో బాలుతో పాటలు పాడించకపోవడానికి గల కారణాన్ని వెల్లడించారు. ఈ ఎపిసోడ్ వచ్చే సోమవారం(జనవరి 4) ఈటీవీ ప్రసారం కానుంది.