సూపర్‌స్టార్ రజనీకాంత్.. త్వరలో బుల్లితెరపై సందడి చేయనున్నాడు. 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' కార్యక్రమంలో సాహసాలు చేయనున్నాడు. ఈ కార్యక్రమం త్వరలో ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను సాహస యాత్రికుడు బేర్ గ్రిల్స్ తన ట్విట్టర్లో పంచుకున్నాడు. తాను ఎంతమంది స్టార్స్‌తో పనిచేసినా, రజనీతో పనిచేయడం ప్రత్యేకమని రాసుకొచ్చాడు.
'మ్యాన్ వర్సెస్ వైల్డ్' రజనీకాంత్ మోషన్ పోస్టర్ - tollywood news
ప్రఖ్యాత 'మ్యాన్ వర్సెస్ వైల్డ్'లోని రజనీకాంత్‌కు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. త్వరలో ఈ కార్యక్రమం టీవీలో ప్రసారం కానుంది.
రజనీకాంత్‌తో బేర్ గ్రిల్స్
గత నెల 28 నుంచి మూడు రోజుల పాటు ఈ కార్యక్రమానికి సంబంధించిన చిత్రీకరణ జరిగింది. కర్ణాటకలోని బండిపురా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో షూటింగ్ చేశారు. అయితే తొలిరోజే తలైవాకు గాయం కావడం వల్ల కొన్నిరోజుల తర్వాత మిగతా భాగాన్ని పూర్తిచేశాడు. ఇది త్వరలో డిస్కవరీ ఛానెల్లో ప్రసారం కానుంది.
ఇది చదవండి:రజనీ పారితోషికంపై 'దర్బార్' ఎఫెక్ట్!
Last Updated : Mar 1, 2020, 8:44 PM IST