సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న 'క్యాష్' షోలో 'ఇష్క్' హీరోహీరోయిన్లు తేజా సజ్జా, ప్రియా వారియర్ సందడి చేశారు. వీరితో పాటు వింద్య, గీతా భగత్‌లు వారి పంచ్‌లతో అలరించారు. తేజ తొడకొట్టే స్టార్ అయితే ప్రియా వారియర్ వింకింగ్ స్టార్ అంటూ సుమ చేసిన వ్యాఖ్యలు నవ్వులు పంచుతున్నాయి.
'క్యాష్'లో తేజ, ప్రియా వారియర్ సందడి - క్యాష్‌లో తేజ సజ్జా, ప్రియా వారియర్
సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న 'క్యాష్' షోలో ఈ వారం 'ఇష్క్' చిత్రబృందం పాల్గొంది. హీరోహీరోయిన్లు తేజ సజ్జా, ప్రియా వారియర్‌తో సుమ చేసిన అల్లరి నవ్వులు పంచుతోంది.
తేజ, ప్రియా వారియర్
అలాగే 'లవ్ గురూ ట్రైనింగ్ సెంటర్' అనే కాన్సెప్ట్‌లో సుమ, తేజ పంచ్‌లు అలరిస్తున్నాయి. ఇందులో అమ్మాయిలు అబ్బాయిల్ని, అబ్బాయిలు అమ్మాయిల్ని పడేయడం ఎలా అనే విషయాన్ని సుమ వెల్లడించారు. వీటితో పాటు ప్రియకు తేజ ప్రపోజ్ చేసే సన్నివేశం ఆకట్టుకుంటోంది. ఈ ఎపిసోడ్ నేటి (ఏప్రిల్ 3) రాత్రి 9.30లకు ప్రసారం కానుంది. అప్పటివరకు ఈ ప్రోమో చూసేయండి.