తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అర్ధాంతరంగా ఆగిపోయిన వర్ష, ఇమ్మాన్యుయల్​ పెళ్లి - సుడిగాలి సుధీర్

జబర్దస్త్​ జోడీ ఇమ్మాన్యుయల్​, వర్షకు పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. సుడిగాలి సుధీర్​ ఇచ్చిన సలహాతోనే తన వివాహం ఆగిపోయిందని ఇమ్మాన్యుయల్​ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈటీవీలో ప్రతి ఆదివారం ప్రసారమవుతున్న 'శ్రీదేవీ డ్రామా కంపెనీ'(Sridevi Drama Company) కార్యక్రమంలో ఇదంతా జరిగింది. అయితే ఈ ఎపిసోడ్​లో అసలేం జరిగిందో తెలుసా?

Sudigali Sudheer breaks up Varsha and Emmanuel Marriage
అర్థాంతరంగా ఆగిపోయిన వర్ష, ఇమ్మాన్యుయల్​ పెళ్లి

By

Published : Jul 5, 2021, 10:43 AM IST

Updated : Jul 5, 2021, 11:36 AM IST

జబర్దస్త్​ ఆన్​స్క్రీన్​ లవ్​బర్డ్స్​ ఇమ్మాన్యుయల్​, వర్ష పెళ్లి ఆగిపోయింది. సన్నిహితుల మధ్య వివాహం ఘనంగా చేసుకోవాలన్న ఇమ్మాన్యుయల్​కు నిరాశే మిగిలింది. వ్యాఖ్యాత సుడిగాలి సుధీర్​ ఇచ్చిన సలహాతో తన పెళ్లి ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు ఇమ్మాన్యుయల్​. ఆ తర్వాత కంట్రోల్​ తప్పి చేయరాని నేరాన్ని చేసేశాడు. అయితే అసలు పెళ్లి ఏంటి? ఆగిపోవడమేంటి అని ఆశ్చర్యపోతున్నారా?

అయితే ఇది నిజం పెళ్లి కాదండోయ్​. ప్రతి ఆదివారం తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం సహా ప్రతిభావంతులను పరిచయం చేస్తున్న ఎంటర్‌టైన్మెంట్​ షో 'శ్రీదేవి డ్రామా కంపెనీ'(Sri Devi Drama company) షోలో ఇమ్మాన్యుయల్​, వర్ష పెళ్లి ఎపిసోడ్​ ప్రసారమైంది. అందులో వర్ష, ఇమ్మాన్యుయల్​ కలిసి పెళ్లి చేసుకుందామని సిద్ధమవుతారు. అయితే అంతలోనే వ్యాఖ్యాత సుడిగాలి సుధీర్​ ఇచ్చిన సలహాతో ఇమ్మాన్యుయల్​ చిక్కుల్లో పడతాడు.

కరోనా సంక్షోభం నేపథ్యంలో పెళ్లికి 20 మందిని మాత్రమే పిలవాలనే నిబంధన ఉండగా.. 40 మందిని పిలవమని సుధీర్‌ ఇచ్చిన సలహాతో ఇమ్మూ పెళ్లి ఆగిపోయింది పాపం. దీంతో ఇమ్మాన్యుయెల్‌ కోపం తట్టుకోలేక 'ఓరెయ్‌ సుధీర్‌ ఇటురారా' అంటూ ఆవేశంతో ఊగిపోయాడు. మొత్తం ఎపిసోడ్​ చూడాలంటే ఈ వీడియోను చూసేయండి మరి.

ఇదీ చూడండి..ఇమ్మాన్యుయేల్​-వర్ష: పెళ్లిపీటలెక్కిన 'జబర్దస్త్'​ జోడీ!

Last Updated : Jul 5, 2021, 11:36 AM IST

ABOUT THE AUTHOR

...view details