రష్మి ప్రేమ కోసం మళ్లీ జన్మిస్తా అంటున్నారు నటుడు సుడిగాలి సుధీర్. బుల్లితెర వేదికగా ప్రసారమయ్యే 'ఎక్స్‌ట్రా జబర్దస్త్', 'ఢీ' కార్యక్రమాలతో ఈ జోడీ ప్రతి ఒక్కరికీ పరిచయమే. ఇప్పుడు ఈ జోడీ ప్రేక్షకులను మరోసారి ఫిదా చేసింది. అనసూయ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతున్న 'జబర్దస్త్' షోలో వీళ్లిద్దరూ తళుక్కున మెరిశారు.
హైపర్ ఆది స్కిట్‌లో 'జబర్దస్త్' స్టేజ్‌పై సుధీర్-రష్మి సందడి చేశారు. గురువారం ప్రసారమైన ఈ ఎపిసోడ్‌లో ఆది-దీపిక, సుధీర్-రష్మిల వివాహాన్ని సరదాగా స్కిట్ రూపంలో చూపించారు. ఇందులో రష్మి.. 'సుధీర్.. ఒకవేళ నేను ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే ఏం చేసేవాడివి' అని ప్రశ్నించగా.. 'నీ ప్రేమ కోసం వందసార్లు మరణించైనా ఒక్కసారి జన్మిస్తాను. ఆ సూర్యరశ్మి ఉన్నంత కాలం ఈ సుధీర్-రష్మి ఉంటారు' అని సమాధానమిస్తాడు.