తెలంగాణ

telangana

ETV Bharat / sitara

17 ఏళ్లకే ఇంట్లోంచి వెళ్లిపోయా: శ్రీవాణి - ఆలీతో సరదాగా నవ్య స్వామి

'ఆలీతో సరదాగా' షోలో పాల్గొని సందడి చేశారు బుల్లితెర నటీమణులు శ్రీవాణి, నవ్యస్వామి. పలు ఆసక్తికర విషయాలు అభిమానులతో పంచుకున్నారు. అవేంటో చూసేయండి.

Alitho saradag
ఆలీతో సరదాగా

By

Published : May 25, 2021, 10:06 AM IST

ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ టాక్ షో 'ఆలీతో సరదాగా'. ఈ వారం ఈ షోకు అతిథులుగా విచ్చేశారు బుల్లితెర నటీమణులు శ్రీవాణి, నవ్య స్వామి. వారి కెరీర్, జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలను పంచుకున్నారు. సీరియల్ షూటింగ్​లతో బిజీగా ఉండగా 17 ఏళ్లకు ఇంట్లోంచి వెళ్లిపోయిన సంఘటనను గుర్తు చేసుకుంది శ్రీవాణి. ఆ తర్వాత తామిద్దరం పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించింది. 'మీతో పాటు అసిస్టెంట్​ను కూడా తీసుకెళ్లారంట' అన్న ఆలీ ప్రశ్నకు నవ్వులు విరిశాయి.

అలాగే బుల్లితెర ఇండస్ట్రీలో మొట్టమొదట కరోనా సోకింది తనకే అంటూ చెప్పుకొచ్చింది నవ్యస్వామి. ఆ సమయంలో తనతో ఎవరూ లేరని, తాను ఉంటున్న గేటెడ్ కమ్యూనిటీలోకి కూడా రానివ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన జీవితంలో ఎక్కువగా బాధపడ్డ రోజులు అవే అని తెలిపింది. 'మీరు లవ్ పెయిల్యూర్ అంట కదా? లైఫ్​లో చాలా ఇబ్బందులు పడ్డారంట' అనీ ఆలీ అడగ్గా.. నిజమేనని తెలిపింది నవ్య. ఒక రాంగ్ పర్సన్​ను ప్రేమించానని వెల్లడించింది.

వీటితో పాటు తమ జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందుల్ని చెబుతూ కన్నీట పర్యంతమయ్యారు వాణి శ్రీ, నవ్యస్వామి. ఆ పూర్తి ఎపిసోడ్ చూసేయిండి.

ABOUT THE AUTHOR

...view details