Sridevidrama company: ప్రతివారం కొత్త కొత్త కాన్సెప్ట్‌లతో అబ్బురపరుస్తూ వస్తున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ'.. ఈసారి కంటతడి పెట్టించింది. అలానే ప్రేక్షకుల్ని ఆలోచింపజేసింది. అందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం అలరిస్తోంది.
ఈసారి 'శ్రీదేవి డ్రామా కంపెనీ' కొత్త ఎపిసోడ్‌కు గెస్ట్‌గా హీరో నందమూరి తారకరత్న వచ్చారు. సుడిగాలి సుధీర్‌పై యాంకరింగ్ చెయ్ అంటూ పంచులు కూడా వేశారు. గెటప్ శ్రీను 'అరుణాచలం'లోని రజనీకాంత్ గెటప్‌లో సందడి చేశాడు. అతడి తోడు పంచ్ ప్రసాద్.. ఆటో పంచ్‌లు వేస్తూ కితకితల పెట్టించాడు. దీని తర్వాత వచ్చిన హైపర్ ఆది, రాంప్రసాద్, తదితరులు నవ్విస్తూనే ఎంటర్టైన్ చేశారు.