వృత్తి జీవితంలో ఎదురైన ఆటుపోట్లను తట్టుకొని నిలబడటానికి, కుంగుబాటులో ధైర్యం చెప్పడానికి మనకు ఎల్లవేళలా ఓ గురువు లాంటి వ్యక్తి ఉంటారు. అలా తను ఆత్మహత్యకు యత్నించిన సమయంలో చలాకీ చంటి కొండంత అండగా నిలబడి ఆదుకున్నట్లు చెప్పాడు జబర్దస్త్ నటుడు రాకింగ్ రాకేశ్. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో గురుపూజోత్సవం సందర్భంగా భావోద్వేగానికి గురయ్యాడు.
"జబర్దస్త్‌లో టీమ్ లీడర్‌గా నిలదొక్కుకోవడం అంటే మాములు విషయం కాదు. ఒక టైంలో టీమ్ లీడర్‌గా నన్ను తీసేశారు. ఆ సమయంలో డిప్రెషన్లోకి వెళ్లాడు. సూసైడ్కూ యత్నించాను. కారును చెట్టుకు కావాలని గుద్దేశాను. నన్ను సారథిగా తీసేసిన సమయంలో తన టీమ్‌లో పెట్టుకొని, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది చంటి అన్న. మళ్లీ ఈరోజు టీమ్‌లీడర్‌గా నిల్చున్నాను అందుకు కారణం చంటి అన్నే"