తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పవర్‌స్టార్‌ బర్త్‌డే.. లేడీ స్టార్స్‌ ఇరగదీశారు! - ఈటీవీ భారత్ సినిమా వార్తలు

ఈటీవీలో ప్రసారమవుతున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' రియాలిటీ షో పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్​కు బర్త్‌డే స్పెషల్‌ విషెస్‌ తెలిపింది. ఈ మేరకు ప్రోమో విడుదలైంది. లేడీస్‌ కిట్టి పార్టీ పేరుతో వచ్చే ఆదివారం ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

శ్రీదేవి డ్రామా కంపెనీ
శ్రీదేవి డ్రామా కంపెనీ

By

Published : Aug 24, 2021, 8:52 PM IST

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ బర్త్‌డేను పురస్కరించుకుని సినీ, బుల్లితెర తారలందరూ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. పవర్‌స్టార్‌ నటించిన సినిమాల్లోని పాటలకు స్టేజ్‌పై హుషారెత్తించేలా డ్యాన్స్ చేశారు. ఈ సెలబ్రేషన్స్‌లో నటి హేమతోపాటు ఇంద్రజ కూడా పాల్గొని.. అందర్నీ మెప్పించారు. 'అమ్మా.. నాన్నా.. పవన్‌కల్యాణ్‌ ఎప్పుడూ మన హృదయంలోనే ఉండిపోతారు' అంటూ ఇంద్రజ.. పవన్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ మొత్తం సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఓ ప్రోమో వీడియోని 'శ్రీదేవి డ్రామా కంపెనీ' విడుదల చేసింది.

ప్రతి ఆదివారం మధ్యాహ్నం ఈటీవీ వేదికగా ప్రసారమవుతున్న ఎంటర్‌టైన్‌మెంట్‌ షో 'శ్రీదేవి డ్రామా కంపెనీ'. సుధీర్‌ వ్యాఖ్యాతగా 'జబర్దస్త్‌', 'ఎక్స్ ట్రా జబర్దస్త్‌' కమేడియన్లు.. 'ఢీ' డ్యాన్సర్లు.. బుల్లితెర నటీనటులు ఈ షోలో ప్రతివారం సందడి చేస్తోన్న విషయం తెలిసిందే. ఇంద్రజ, హేమ , యూట్యూబ్‌ స్టార్‌ సునైనా తాజాగా ఈ షోలో తళుక్కున మెరిశారు.

సెప్టెంబర్‌ 2న జరగనున్న పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ బర్త్‌డేను పురస్కరించుకుని స్పెషల్‌ విషెస్‌ తెలిపారు. ఓ వైపు నటీనటుల స్పెషల్‌ డ్యాన్స్‌ పెర్ఫామెన్స్‌లు.. మరోవైపు విజయశాంతిలా రోహిణి చేసిన యాక్టింగ్‌.. రామ్‌ప్రసాద్‌, ఆది వరుస పంచులతో షో ఆద్యంతం సందడిగా సాగింది. 'లేడీస్‌ కిట్టి పార్టీ' పేరుతో వచ్చే ఆదివారం ప్రసారం కానున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ప్రోమో చూడండి..!

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details