ఈటీవీలో ప్రతి ఆదివారం ప్రసారమయ్యే 'శ్రీదేవి డ్రామా కంపెనీ' కొత్త ప్రోమో వచ్చేసింది. ఎప్పటిలానే ఆద్యంతం అలరిస్తూ, ఎపిసోడ్‌పై అంచనాల్ని పెంచుతోంది.
డిసెంబరు 12న ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. అదేరోజు పుట్టినరోజు ఉన్న సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు అదిరిపోయే రేంజ్లో ట్రిబ్యూట్ ప్లాన్ చేశారు. అందుకు సంబంధించిన కొన్ని విజువల్స్ ప్రోమోలో కనిపిస్తున్నాయి.
శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో రాబోయే వారం ఎపిసోడ్‌కు ప్రముఖ నటులు పృథ్వీరాజ్, జ్యోతి అతిథులుగా విచ్చేశారు. హైపర్ ఆది, 'రంగస్థలం' చిట్టిబాబుగా.. ఆటో రాంప్రసాద్ 'పుష్ప' పాత్రల్లో కనిపించి సందడి చేశారు.
హైపర్ ఆది- సుడిగాలి సుధీర్-ఆటో రాంప్రసాద్ తెలంగాణ ఫోక్ సాంగ్‌తో ఇద్దరు సింగర్స్ ఫుల్ హుషారు తెప్పించారు. ఆది, రాంప్రసాద్, నరేశ్ చేసిన హాస్యం తెగ నవ్విస్తోంది. మరగుజ్జుగా నటించి, డ్యాన్స్ చేసిన హాస్యనటుడు కెవ్వు కార్తిక్.. అందరికీ కన్నీళ్లు తెప్పించాడు. చివర్లో అతడు కాళ్ల నొప్పితో స్టేజీపై పడిపోయాడు. అసలు అక్కడ ఏం జరిగింది తెలియాలంటే.. పూర్తి ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే.
ఇవీ చదవండి: