తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో మెగాస్టార్ బర్త్​డే హంగామా - chiranjeevi birthday

శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో అలరిస్తోంది. చిరుబర్త్ డేతో పాటు రాఖీ పండగను ఆనందంగా జరిపి, అభిమానులకు ఫుల్​ ఎంటర్​టైన్​మెంట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఆదివారం ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

sridevi drama company latest promo
'శ్రీదేవి డ్రామా కంపెనీ'

By

Published : Aug 15, 2021, 5:57 PM IST

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు, రాఖీ పండగ.. ఈసారి ఒకేరోజు(ఆగస్టు 22) వచ్చాయి. దీంతో ఈ రెండింటికి ప్రాధాన్యమిస్తూ 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ఫుల్​ హంగామా చేశారు. ఈ సందర్భంగా వచ్చిన షో లేటెస్ట్ ప్రోమో.. నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.

చిరు సినిమాల్లో హిట్​ పాటలకు వర్ష-ఇమ్యాన్యుయేల్, రాంప్రసాద్-రోహిణి, గెటప్​ శీను-భాను జోడీలు డ్యాన్సులు చేసి అదరగొట్టారు. మరోవైపు సుధీర్, రాంప్రసాద్, కెవ్వు కార్తీక్, బాబు సోదరీమణులు వచ్చి వాళ్లకు రాఖీలు కట్టారు. ఆ తర్వాత తమ తమ్ముళ్లపై పంచులు వేసి నవ్వించారు.

శ్రీదేవి డ్రామా కంపెనీ టాక్ షో

రవికృష్ణ-సావిత్రి.. రాఖీ పండగ సందర్భంగా అద్భుతమైన డ్యాన్స్ ప్రదర్శన చేశారు. దీనిని చూసి సెట్​లో ఉన్న వారందరూ భావోద్వేగాన్ని నియంత్రించుకోలేకపోయారు. సీరియల్ నటి శిరీష్.. తనకు అన్నయ్య లేడని చెప్పగా, సుధీర్ ఇకపై ఆమెకు అన్నయ్య అవుతానని మాటిచ్చాడు.

ఫన్, డ్యాన్స్, ఎమోషనల్​.. ఇలా అన్ని భావోద్వేగాలతో అలరిస్తున్న ఈ ఎపిసోడ్.. ఆగస్టు 22 మధ్యాహ్నం 1:30 గంటలకు ఈటీవీలో ప్రసారవుతుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details