శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో ఆకట్టుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణతోపాటు ఇతర హీరోల చేస్తున్న సేవలకు గుర్తుగా.. గెటప్ శీను డ్యాన్స్ ప్రదర్శన చేశారు. సాయానికి ప్రచారం లేకపోయినా, కనీసం సమాచారం ఇస్తే వేరేవాళ్లకు స్పూర్తిగా నిలుస్తుందని శీను చెప్పారు.
ఇదే కాకుండా ట్రైన్ జర్నీలో క్లాస్, మాస్ ప్రజల మధ్య తేడాలను చాలా హాస్యభరితంగా చూపించే ప్రయత్నం చేశారు. హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, సుడిగాలి సుధీర్.. బెగ్గర్ గెటప్స్‌లో చేసిన స్కిట్లోని సన్నివేశాలు నవ్విస్తున్నాయి.