తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సుధీర్​కు ప్రియదర్శి దిమ్మతిరిగే పంచ్ - శ్రీదేవీ డ్రామా కంపెనీ స్నేహితుల దినోత్సవం

బుల్లితెర వేదికగా ప్రేక్షకుల్ని అలరిస్తోన్న షో 'శ్రీదేవి డ్రామా కంపెనీ'. ప్రతి ఆదివారం మధ్యాహ్నం ఈటీవీలో ప్రసారమవుతోంది. తాజాగా ఈ ప్రోగ్రామ్​కు సంబంధించిన ఫ్రెండ్ షిప్​ డే లేటెస్ట్ ప్రోమో ఆకట్టుకుంటోంది.

Sridevi Drama Company
శ్రీదేవీ డ్రామా కంపెనీ

By

Published : Jul 26, 2021, 5:04 PM IST

బుల్లితెర ప్రేక్షకులకు మంచి వినోదం పంచే కార్యక్రమాల్లో 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ఒకటి. సుధీర్‌ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రతి ఆదివారం ప్రసారమవుతోన్న ఈ షో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. ఆగస్టు 1న స్నేహితుల దినోత్సవం సందర్భంగా 'స్నేహమేరా జీవితం' పేరుతో ప్రత్యేక ఎపిసోడ్‌ రూపొందింది. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలై, నవ్విస్తూనే భావోద్వేగానికి గురి చేస్తోంది.

సినీ నటులు ప్రియదర్శి, అభినవ్‌ గోమటం, కొందరు సీరియల్‌ తారలు ఈ షోలో మెరిశారు. తమ తమ స్నేహితుల గురించి మాట్లాడారు. అనంతరం సుధీర్‌- ప్రియదర్శి, అభినవ్‌ గోమటం- ప్రసాద్‌ మధ్య పంచ్‌ల యుద్ధం మొదలైంది. ప్రియదర్శి ఇచ్చిన కౌంటర్‌కి సుధీర్‌, ప్రసాద్‌ ఇచ్చిన కౌంటర్‌కి అభినవ్‌ అయోమయంలో పడిపోయి, హావభావాలతో కామెడీ పండించారు. సుధీర్‌, గెటప్‌ శ్రీను, రామ్‌ ప్రసాద్‌ ఆలపించిన 'ఓ మై ఫ్రెండ్‌' గీతం అలరిస్తుంది. నూకరాజు తమ్ముడు, ప్రసాద్‌ స్నేహితుడి మాటలు మెప్పించాయి. మధ్యలో ఇద్దరు స్నేహితులు దిగిన ఓ ఫొటో గురించి వ్యాఖ్యానిస్తూ ఆది, సుధీర్‌, ప్రసాద్‌ గిలిగింతలు పెట్టారు.

ఇలా సరదాగా సాగే వీడియోలో భావోద్వేగ సన్నివేశం ప్రత్యక్షమై అందరి హృదయాల్ని హత్తుకుంటుంది. స్నేహం విలువేంటో నూకరాజు, ఇమ్మాన్యుయేల్‌ తమ స్కిట్‌ ద్వారా తెలియజేసే దృశ్యమిది. కళ్లు లేని వ్యక్తిగా నూకరాజు, అతనికి కళ్లు దానం చేసే స్నేహితుడిగా ఇమ్మాన్యుయేల్ పాత్రలు ప్రతి ఒక్కరినీ కట్టి పడేస్తున్నాయి. దీన్ని చూసి చలించిన ప్రియదర్శి 'నూకరాజు, ఇమ్మాన్యుయేల్‌.. సమయం దొరికితే దయచేసి సినిమాల్లో ప్రయత్నించండి' అని తన మనసులో మాట తెలిపారు. ఈ ఎపిసోడ్ ఆదివారం (ఆగస్టు 1) మధ్యాహ్నం ఒంటి గంటకు ఈటీవీలో ప్రసారమవుతుంది. అప్పటివరకు ఈ ప్రోమో చూస్తూ మీరూ మీ స్నేహితుల్ని గుర్తు చేసుకోండి..

ఇవీ చూడండి: 'పుష్ప' ఐటమ్ సాంగ్​ కోసం సన్నీ లియోనీ!

ABOUT THE AUTHOR

...view details