తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మూడేళ్ల తర్వాత సదా రీఎంట్రీ.. పాట పాడిన ఇంద్రజ - sudigaali sudheer jabardast

ఒకే షోలో కనిపించిన సదా, ఇంద్రజ.. అభిమానులు ఆహా అనే ప్రదర్శనలతో మెప్పించారు. సదా డ్యాన్స్​తో అలరించగా, ఇంద్రజ పాట పాడి ఆకట్టుకున్నారు.

Sridevi Drama Company latest promo
సదా - ఇంద్రజ

By

Published : Jul 19, 2021, 10:01 AM IST

హీరోయిన్ సదా.. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత బుల్లితెరపై సందడి చేసింది. ఈటీవీలో ప్రతి ఆదివారం ప్రసారమయ్యే 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోకు విచ్చేసి, డ్యాన్సుతో అలరిచించింది. అందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

'కోడికూర చిల్లుగారె' అంటూ సాగే మాస్ గీతానికి హైపర్ ఆది, రాంప్రసాద్, ఇమ్మాన్యుయేల్, వర్ష, భాను.. సూపర్ డ్యాన్స్​తో అదరగొట్టారు. ప్రచారంలో భాగంగా 'ఇందువదన' టీమ్.. ఈ​ షోలో సందడి చేసింది. వరుణ్ సందేశ్, పార్వతీశంతో పాటు దర్శకుడు వచ్చారు.

దాదాపు మూడేళ్ల తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన సదా.. తన తొలి చిత్రం 'జయం'లోని 'రానురాను అంటూనే చిన్నది' పాటకు డ్యాన్స్ చేసి మెప్పించింది. 'ఢీ' స్ఫూఫ్​ చేసిన రాంప్రసాద్, ఆది, సుధీర్​ కితకితలు పెట్టించారు.

'శ్రీదేవి డ్రామా కంపెనీ' జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజ.. 'లాలీ లాలీ' పాట పాడి ఆహా అనిపించారు. నటిగానే ఇప్పటివరకు మనకు తెలిసిన ఆమె.. సింగర్​గానూ తానేం తక్కువ కాదని నిరూపించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details