కడుపున పుట్టిన వారే 'మీరు నాకు భారం' అని అంటే ఆ తల్లిదండ్రులు తట్టుకోగలరా? ఇదుగో నీ కోసం దుప్పట్లు తీసుకొస్తా, పండ్లు కొనుకొస్తా అని చెప్పి వృద్ధాశ్రమం దగ్గర వదిలేస్తే వారి గుండెలు పగలకుండా ఉండగలవా? ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినా, ఎన్ని చూసినా అంతే! ఇలా చేసే వారిలో మార్పు తీసుకొచ్చేందుకు 'శ్రీదేవి డ్రామా కంపెనీ' (ఈటీవీ) కార్యక్రమం ప్రత్యేక ఎపిసోడ్‌ను రూపొందించింది. వృద్ధాశ్రమాల్లో ఉండే వారికి అంకితమిచ్చింది. దానికి సంబంధించిన ప్రోమో విడుదలై, హృదయాన్ని బరువెక్కిస్తోంది.
వారంతా ఓ వృద్ధాశ్రమంలో కాలం గడిపేవారు. కడుపున పుట్టిన వారే కాదన్నారనే బాధలో ఉండే వారి మోముల్లో చిరు నవ్వులు విరబూయించే ప్రయత్నం ఇది. ఓ బామ్మతో కలిసి ఆది చేసిన కామెడీ అందరిలోనూ ఆనందం నింపింది. అనంతరం ఆ పెద్దావిడే 'అమ్మా చూడాలి.. నిన్నూ నాన్నని చూడాలి' అంటూ ఆలపించి, హృదయాన్ని హత్తుకుంది. తన బిడ్డల్ని తలచుకుని కంటతడి పెట్టుకోవటం వల్ల అందరి కళ్లూ చెమ్మగిల్లాయి.
ఏడ్చేసిన సుధీర్..