రామ్‌ప్రసాద్, ఆది బుల్లితెరపై వినోద యుద్ధం చేసేందుకు సిద్ధమయ్యారు. 'మగధీర' సినిమా స్పూఫ్‌తో రామ్ ప్రసాద్.. 'బాహుబలి' స్పూఫ్‌తో ఆది సందడి చేయనున్నారు. ఎక్కడంటారా? ఇంకెక్కడ.. మీ అభిమాన కార్యక్రమం 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో(Sridevi Drama Company Latest Promo)! సుడిగాలి సుధీర్ వ్యాఖ్యాతగా(Sudigali Sudheer Skit) ప్రతి ఆదివారం ఈటీవీలో ప్రసారమవుతున్న ఎంటర్‌టైన్‌మెంట్ షో ఇది. సెప్టెంబరు 19న ఈ ప్రత్యేక ఎపిసోడ్ ప్రసారంకానుంది. దానికి సంబంధించిన ప్రోమో లేటెస్ట్ విడుదలైంది. ఆద్యంతం నవ్వులు పంచుతోంది.
"400 సంవత్సరాల క్రితం.. కామెడీని కాపాడే వీరుడు, పేమెంట్ కోసం ప్రాణాలిచ్చే ధీరుడు.. ఆటో భైరవ" అంటూ రామ్ ప్రసాద్(Auto Ramprasad) పాత్ర పరిచయంతో ఈ ప్రోమో ప్రారంభమైంది. తర్వాత 'మగధీర' రాజ్యం యువరాణితో రామ్ ప్రసాద్ చేసిన కామెడీ కడుపుబ్బా నవ్విస్తోంది. "హాస్య ప్రపంచానికే రాజ్యాధినేత, పంచ్‌లతో ప్రాణాలు తీయగల వీరాధివీరుడు.. బాస్మతి సామ్రాజ్యపు ముద్దుబిడ్డ ఆదిబలి" అనే పవర్‌ఫుల్ డైలాగ్‌తో ఆది(Hyper Aadi) ఇచ్చిన ఎంట్రీ విశేషంగా ఆకట్టుకుంటుంది.