తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'టీవీలో వస్తున్నా అమ్మా.. ప్లీజ్ చూడమ్మా'

వృద్ధాశ్రమాల్లో ఉండే వారి కోసం ఓ ప్రత్యేక ఎపిసోడ్ నిర్వహించి వారికి అంకితమిచ్చింది 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షో. (Sri devi drama comany latest episode). దానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్​ ఇటీవల విడుదలై ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంది. ముఖ్యంగా చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన ప్రవీణ్​ అనే కంటెస్టెంట్​.. తన అమ్మ కోసం కన్నీరు పెట్టుకున్న తీరు అందరి మనసుల్ని కదలించింది. ఆ వీడియోను మీరూ చూసేయండి..

sri devi
శ్రీదేవీ డ్రామా కంపెనీ

By

Published : Oct 6, 2021, 2:46 PM IST

"నా చిన్నప్పుడు 9ఏళ్ల వయసులో అమ్మ చనిపోయింది. అమ్మ ప్రేమ ఎవరికి మాత్రం తెలియదు. రోజు షూటింగ్​ నుంచి వెళ్లిపోయాక ప్రతిఒక్కరికీ వాళ్ల అమ్మ 'తిన్నావారా?' అంటూ ఫోన్​ చేస్తారు. కానీ నాకు ఎవరూ ఫోన్​ చేసే వారు లేరు. నన్ను అడిగేవారు లేరు. రోజూ రూమ్​లో కూర్చొని బాధపడతా. ఏడుస్తా. మీరందరూ అమ్మలు ఉండి కూడా ఎవరు చూసుకోవట్లేదు. వారిని విడిచి ఎలా ఉంటున్నారు? మా అమ్మ లేకపోతే బతకలేకపోతున్నా. కష్టంగా ఉంది. మీరు మీ తల్లులను తీసుకెళ్లండి అన్నా దయచేసి దండం పెడతా. ప్లీజ్​ అన్నా".. ఇదంతా చదువుతుంటే కన్నీళ్లు ఆగట్లేదు కదూ. 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో(Sridevi drama company latest episode).. తల్లిని కోల్పోయిన ప్రవీణ్​ అనే కంటెస్టెంట్​ కన్నీరు పెట్టుకుంటూ తన మనసులోని వ్యథను చెప్పుకొన్న తీరు ఇది.

'శ్రీదేవి డ్రామా కంపెనీ' ప్రోగ్రామ్ (Sridevi drama company timings).. 'తల్లిదండ్రులను వదిలేసిన పిల్లల్లో మార్పు తెచ్చేందుకు' ఇటీవల ఓ ప్రత్యేక కార్యక్రమం చేసింది. అనాథలుగా ఉన్న వృద్ధులను షోకు పిలిపించి వారికి వినోదాన్ని పంచింది. దానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ఇటీవల ప్రసారమై ప్రతి ప్రేక్షకుడి చేత కన్నీరు పెట్టించింది. ఆలోచింపజేసేలా ఉన్న ఈ ఎపిసోడ్ వారి మనసులను కదిలించింది. ఈ షోలోనే ప్రవీణ్​.. చనిపోయిన తన అమ్మను ప్రతిరోజు గుర్తుచేసుకుంటూ ఎంతగా బాధపడ్డాడో వివరించాడు. తన మాటలతో ప్రేక్షకుల హృదయాల్ని బరువెక్కించాడు. 'తల్లిదండ్రులను వదిలేయకండి' అంటూ బతిమాలాడు. అలాంటి వారు ఉంటే కన్నవాళ్లను వెనక్కి తీసుకెళ్లాలని కోరాడు.

"మా అమ్మకు ఇద్దరు అబ్బాయిలం. మేము చాలా గొప్పవాళ్లు అవుతామని ఆమె చెప్పేది. 'అమ్మ నేను ఇవాళ టీవీలో వస్తున్నా. నువ్వు చూడట్లేదు. ఊరిలో వారు అందరూ చూస్తున్నారు. కానీ నువ్వు చూడట్లేదు. అమ్మ ప్లీజ్​ నన్ను చూడు'. 'మీ అమ్మ ఉంటే బాగుండు. ఎంతో మంది చూస్తున్నారు. కానీ మీ అమ్మ చూడలేకపోయింది' అని ఊరిలో వారు అందరూ అంటుంటారు. అమ్మ ప్లీజ్​ చూడు." అంటూ ప్రవీణ్​ భావోద్వేగానికి గురయ్యాడు.

ప్రవీణ్​ మాట్లాడిన ఒక్కొక్క మాటకు, అమ్మ కోసం తాను పడే తపన, ప్రేమ చూసి అక్కడ ఉన్న యాంకర్లు, కంటెస్టెంట్​లు, వీక్షకులు ప్రతిఒక్కరూ కన్నీరు పెట్టుకున్నారు. అతడిని ఓదార్చారు. సుడిగాలి సుధీర్​, హైపర్​ ఆది సహా పలువురు.. ఎవరూ తమ తల్లిదండ్రులను వదిలేయద్దు అని కోరారు. మేమున్నాం అంటూ ప్రవీణ్​కు ధైర్యాన్నిచ్చారు. ఆ వీడియోను మీరూ చూసేయండి..

ఇదీ చూడండి: Sridevi Drama Company: ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకునే వీడియో!

ABOUT THE AUTHOR

...view details