బుల్లితెర ప్రేక్షకులకు(Sridevi drama company latest episode) మంచి వినోదం పంచే కార్యక్రమాల్లో 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ఒకటి. సుధీర్ వ్యాఖ్యాతగా ప్రతి ఆదివారం మధ్యాహ్నం ఈటీవీలో ప్రసారమయ్యే ఈ షో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటోంది. నవంబరు 7న ప్రసారం కానున్న ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో ఇప్పుడు విడుదలై ఆకట్టుకుంటోంది. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను(sridevi drama company contestants) చేసిన 'అతడు' కామెడీ స్ఫూఫ్ కడుపుబ్బా నవ్విస్తోంది.
వారెవ్వా.. ఇంద్రజ ఎంత అద్భుతంగా పాడిందో! - శ్రీదేవీ డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో
'శ్రీదేవీ డ్రామా కంపెనీ'(Sri devi drama company latest promo) షోలో న్యాయనిర్ణేత ఇంద్రజ ఓ పాటను అద్భుతంగా ఆలపించి కంటెస్టెంట్లను ఆకట్టుకున్నారు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను చేసిన 'అతడు' స్ఫూఫ్ కడుపుబ్బా నవ్విస్తోంది. అందుకు సంబంధించిన కొత్త ప్రోమో చూసేయండి.
![వారెవ్వా.. ఇంద్రజ ఎంత అద్భుతంగా పాడిందో! indraja](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13518147-513-13518147-1635755199396.jpg)
ఇంద్రజ
'జీన్స్' సినిమాలోని 'కన్నులతో చూసేది గురువా' పాటను జడ్జి ఇంద్రజ(sri devidrama company judge) అద్భుతంగా ఆలపించడం ఎపిసోడ్కు హైలెట్గా నిలిచింది. నవంబరు 7న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన్ను ప్రశంసిస్తూ ఓ ప్రత్యేక గీతానికి డ్యాన్స్ వేశారు. ఆయనపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు కంటెస్టెంట్లు.
ఇదీ చూడండి: వర్ష రొమాంటిక్ డ్యాన్స్.. ఇమ్మాన్యుయేల్ అయితే..!