బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యం - మనసుమమత సీరియల్ నటి ఆత్మహత్య
08:48 September 09
బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యం
బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఎస్సార్ నగర్ పోలీసుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. దేవరాజురెడ్డి తనని వేదిస్తున్నాడంటూ జూన్ 22న ఎస్సార్ నగర్ పోలీసులకు శ్రావణి ఫిర్యాదు చేసింది. గతంలో టిక్‌టాక్‌లో పరిచయమైన దేవరాజు రెడ్డిని శ్రావణి ప్రేమించింది. అతని నిజస్వరూపం తెలిసి అతడికి దూరంగా ఉంది. అయితే అనంతరం డబ్బుల కోసం వేధించడం మొదలుపెట్టాడు.
శ్రావణి వ్యక్తిగత ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించడం ప్రారంభించాడు. లక్ష రూపాయలు ఇస్తే.. ఫోటోలు డిలీట్ చేస్తానని దేవరాజు.. శ్రావణితో చెప్పాడు. అందుకు ఒప్పుకున్న శ్రావణి విడతల వారిగా గూగుల్ పే ద్వారా నగదు పంపింది. డబ్బులు పంపించినప్పటికీ.. వేధింపులు ఆగలేదు. ఈ విషయంపై శ్రావణి పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల ఇవాళ ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు.