బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్ రెడ్డి పోలీసులకు లొంగిపోయాడు. హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్ పోలీసు స్టేషన్లో విచారణకు హాజరైనట్లు సీఐ నరసింహారెడ్డి పేర్కొన్నారు.
'బుల్లితెర నటి ఆత్యహత్య కేసును క్షేత్రస్థాయిలో విచారిస్తాం' - బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య వార్తలు
దేవరాజు స్టేషన్‌కు వచ్చి లొంగిపాయాడని... అతనిని విచారిస్తున్నట్లు ఎస్సార్‌నగర్ సీఐ నర్సింహారెడ్డి తెలిపారు. ఈ కేసులో సాయి కృష్ణా రెడ్డిని, శ్రావణి కుటుంబసభ్యులను సైతం విచారిస్తామని వెల్లడించారు.
'పూర్తి స్థాయిలో విచారణ జరుపుతాం.. తప్పకుండా న్యాయం చేస్తాం'
అనంతరం సాయి కృష్ణా రెడ్డిని, శ్రావణి కుటుంబ సభ్యులను విచారిస్తామని తెలిపారు. ఆడియో రికార్డులను కూడా పరిశీలిస్తున్నామన్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితులకు శిక్ష పడేలా చేస్తామని సీఐ తెలిపారు.