ఎక్కడైనా నటనకు, ప్రతిభకు అవార్డులు ఇస్తారు. కానీ.. చిరునవ్వుకు అవార్డు ఇస్తారా? అవును.. తన నవ్వుకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చిందని సీనియర్ నటి స్నేహ చెప్పారు. చిన్నప్పుడు క్లాస్‌రూంలో స్నాక్స్, కోక్ తీసుకుంటూ పాఠాలు వినేదాన్నని అన్నారు. ఈటీవీలో ప్రతి సోమవారం ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి అతిథిగా వచ్చిన స్నేహ.. తన జీవితంలోని ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. ఒక్కోసారి వ్యక్తులు గుర్తుంటారు.. కానీ పేర్లు గుర్తుండవని అన్నారు. 'ప్రియమైన నీకు' చిత్రంలో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టానని తెలిపారు.
శ్రీరామదాసు సినిమాలో హీరోయిన్ పాత్ర చేసేందుకు చాలా కష్టపడ్డానని స్నేహ అన్నారు. నటి సౌందర్యకు పెద్ద అభిమానినని చెప్పారు. సౌందర్య మరణవార్త విని షాక్‌కు గురయ్యానన్నారు. ఓసారి కారులో తన కుటుంబంతో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగిందనే విషయాన్ని వెల్లడించారు. నెల రోజుల పాటు బెడ్‌రెస్ట్ తీసుకున్నానని చెప్పారు.