కళాశాలలో చదివే రోజుల్లోనే చిత్రసీమలో అడుగుపెట్టాలని ఆలోచన వచ్చినట్లు గాయని సునీత(Sunitha) వెల్లడించారు. గుంటూరు కాలేజీలో చదువుకునే రోజుల్లో చాలామంది కుర్రాళ్లు ఫాలో అయ్యేవారని ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా'(Alitho Saradaga) కార్యక్రమంలో పంచుకున్నారు.
అయితే పాఠశాల చదువుల నుంచే సంగీతంతో పాటు ఖాళీ సమయాల్లో కాంపిటీషన్లుకు సిద్ధం చేయడం తప్ప, అల్లరి చేసే అవకాశం తన పేరెంట్స్ ఇవ్వలేదని చెప్పారు.
తొలి అవకాశం
'గులాబీ' సినిమా సంగీత దర్శకులైన శశి ప్రీతమ్- నాగరాజు.. 'ఈ వేళలో నీవు'(ee velalo neevu) పాటకు కొత్త అమ్మాయి గొంతు అయితే ఈ పాట ఇంకా బాగుంటుందని భావించి తనకు అవకాశం ఇచ్చినట్లు సునీత వెల్లడించారు. ఆ తర్వాత కృష్ణవంశీ, కృష్ణారెడ్డి సినిమాల్లో అవకాశాలు వచ్చాయని ఆమె చెప్పారు.
హీరోయిన్లకు డబ్బింగ్
ప్లేబ్యాక్ సింగర్ గానే కాకుండానే యాంకర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్షకులను అలరించారు గాయని సునీత. అయితే టాలీవుడ్లో తొలిసారి హీరోయిన్ రాశికి డబ్బింగ్ చెప్పినట్లు ఆమె వెల్లడించారు. ఆ తర్వాత సౌందర్య, స్నేహ, సోనాలి బింద్రే, కమలినీ ముఖర్జీ, జెనీలియా, ఇలియానా, త్రిష, కత్రినా కైఫ్‌లతో పాటు ఇంకా చాలామంది స్టార్లకు డబ్బింగ్ చెప్పినట్లు ఆమె చెప్పారు.
ఇదీ చూడండి:Bollywood: సంపాదన కోట్లలో.. ఉండేది అద్దె ఇంట్లో!