తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కపిల్ శర్మ షోకు సిద్ధు రీఎంట్రీ..? - kapil sharma

పుల్వామా దాడి అనంతరం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కాడు నవజ్యోత్ సింగ్ సిద్ధు. జడ్జిగా వ్యవహరిస్తున్న 'ద కపిల్ శర్మ షో' నుంచి వైదొలిగాడు. ఇప్పుడు అదే షోకు సిద్ధు పునరాగమనం చేయనున్నాడని సమాచారం.

ద కపిల్ శర్మ షో

By

Published : Apr 3, 2019, 9:09 AM IST

హాస్య నటుడు కపిల్ శర్మ షోలో హడావుడి అంతాఇంతా కాదు. మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు దానికి తోడైతే వినోదం రెట్టింపవుతుంది. పుల్వామా దాడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు సిద్ధూని షో నుంచి తప్పించాడు కపిల్. తాజాగా ఈ మాజీ క్రికెటర్ మళ్లీ షోలో కనిపించనున్నాడని సమాచారం.

ఓ అవార్డు ఫంక్షన్​లో ఈ విషయంపై స్పందించాడు కపిల్. ప్రస్తుతం లోక్​సభ ఎన్నికల ప్రచారంలో సిద్ధు బిజీగా ఉన్నాడని అన్నాడు. అయితే అతడి పునరాగమనంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

పడిపోయిన టీఆర్​పీ రేటింగ్
సిద్ధు లేని లోటు షోలో కనిపిస్తుందనడానికి టీఆర్​పీ రేటింగే ఉదాహరణ. అతడు వెళ్లిపోయాక షో రేటింగ్ పడిపోయిందని నవభారత్ టైమ్స్ రిపోర్ట్ తెలిపింది. ఈ కార్యక్రమానికి సహ నిర్మాతగా ఉన్న సల్మాన్ ఖాన్.. సిద్ధుని తిరిగి షోకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నాడని వెల్లడించింది.

నవజ్యోత్ సింగ్ సిద్ధు షో నుంచి వెళ్లిపోయాక ఆయన స్థానంలో అర్చనా పూరన్ సింగ్​ని ఎంపిక చేసింది కపిల్ శర్మ షో యూనిట్. కానీ ఆమె కేవలం 20 ఎపిసోడ్ల వరకే ఉండనుందని తెలుస్తోంది. ఇందుకోసం అర్చనకు 2 కోట్లు ఇస్తుండగా .. సిద్ధు సీజన్​కి 25 కోట్లు తీసుకుంటుండటం విశేషం.

ఇవీ చూడండి..దక్షిణాది హారర్ కామెడీ రీమేక్​లో అక్షయ్

ABOUT THE AUTHOR

...view details